Anant Ambani Radhika Merchant : అనంత్ రాధికా నిశ్చితార్థం

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Anant Ambani Radhika Merchant : రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ ముకేశ్ అంబానీ త‌న‌యుడు నిశ్చితార్థం వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అనంత్ అంబానీ , రాధికా మ‌ర్చంట్(Anant Ambani Radhika Merchant) ఇద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. వీరిద్ద‌రి వేడుక‌కు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇద్ద‌రూ గ‌త కొంత కాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు.

ఇరు ఫ్యామిలీస్ వీరిద్ద‌రి పెళ్లికి ఓకే చెప్పాయి. దీంతో లైన్ క్లియ‌ర్ అయ్యింది. శ్రీ‌నాథ్ జీ ఆల‌యాన్ని అనంత్ అంబానీ, రాధికా మ‌ర్చంట్ లు ద‌ర్శించుకున్నారు. ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు చుసుకుంటూ న‌వ్వుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. క్ష‌ణాలలో వైర‌ల్ గా మారారు వీరిద్ద‌రూ.

భ‌గ‌వాన్ శ్రీ‌నాథ్ జీ ద‌ర్బార్ లో అనంత్ అంబానీ ప్రియురాలు రాధికా క‌లిసి అడుగులు వేసుకుంటూ రావ‌డం ఫంక్ష‌న్ కు హైలెట్ గా నిలిచింది. గురువారం రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లోని శ్రీ‌నాథ్ జీ ఆల‌యంలో కుటుంబ స‌భ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వ‌ర‌లో ఒక్క‌ట‌య్యే ఈ అంద‌మైన జంట‌ను ఆల‌య పూజారులు ఆశీర్వదించారు.

ఈ జంట శ్రీ‌నాథ్ జీ ఆశీస్సుల కోసం రోజంతా గ‌డిపార‌ని స‌మాచారం. రాధికా మార్చంట్ పేరెంట్స్ శైలా , వీరేన్ మ‌ర్చంట్ ..అనంత్ అంబానీ త‌ర‌పున ముకేశ్ అంబానీ, నీతా ఈ కార్య‌క్ర‌మంలో ఇచ్చి పుచ్చుకున్నారు. రాబోయే నెల‌లో వీరిద్ద‌రూ పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు.

వీరిద్ద‌రూ ఒక్క‌టయ్యే వేళ అంద‌రి ఆశీర్వాదం కావాల‌ని కోరారు ముకేశ్ అంబానీ, నీతా అంబానీ.

Also Read : ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌గా భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!