Kyle Mayers LSG : కైల్ మేయ‌ర్స్ అదుర్స్

పంజాబ్ కింగ్స్ కు చుక్క‌లు

Kyle Mayers LSG : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ద‌మ్మున్న ఆట‌గాళ్లు దుమ్ము రేపుతున్నారు. త‌మ అసాధార‌ణ ఆట తీరుతో ఆక‌ట్టుకుంటున్నారు. దీంతో ఐపీఎల్(IPL 2023) మ‌రోసారి ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను అల‌రిస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ తో జ‌రిగిన కీల‌క లీగ్ పోరులో ల‌క్నో సూప‌ర్ కింగ్స్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు ఐపీఎల్ చ‌రిత్ర‌లో రెండో అత్య‌ధిక స్కోర్ సాధించింది. ఇక 2023లో జ‌రుగుతున్న ఐపీఎల్ 16 సీజ‌న్ లో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 257 ర‌న్స్ చేసింది. ల‌క్నో కంటే ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో 228 ర‌న్స్ చేసింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ల‌క్నో జెయింట్స్ బ్యాట‌ర్ కైల్ మేయ‌ర్స్(Kyle Mayers LSG) మార‌థాన్ ఇన్నింగ్స్ ఆడాడు. త‌న అనుభ‌వాన్ని రంగ‌రించి పంజాబ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.కేవ‌లం 20 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. ఫోర్లు సిక్స‌ర్ల‌తో ఊచ కోత కోశాడు. కైల్ మేయ‌ర్స్ కేవ‌లం 24 బంతులు ఎదుర్కొని 54 ర‌న్స్ చేస్తే మార్క‌స్ స్టోయినిస్ 40 బంతులు ఆడి 72 ర‌న్స్ చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

Also Read : అధ‌ర్వ తైడే జోర్దార్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!