Rajiv Shukla Dhoni : రాజీవ్ శుక్లా సత్కారం ధోనీ సంతోషం
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అరుదైన జ్ఞాపిక
Rajiv Shukla Dhoni : భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలు అందించిన జార్ఖండ్ డైనమెట్ , చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీని ఘనంగా సత్కరించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. యూపీలోని లక్నో వేదికగా జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మహేంద్ర సింగ్ ధోనీకి(Rajiv Shukla Dhoni) అరుదైన జ్ఞాపికను అందజేశారు. ఘనంగా సత్కరించారు.
భారత క్రికెట్ రంగంలో అరుదైన ఆటగాడు ఎంఎస్ ధోనీ అంటూ కితాబు ఇచ్చారు ఈ సందర్బంగా రాజీవ్ శుక్లా. మిస్టర్ కూల్ గా పేరు పొందిన ధోనీ ఏనాడూ ఆవేశ పడిన దాఖలాలు లేవని కితాబు ఇచ్చారు. సుదీర్ఘ కాలం పాటు విశిష్ట సేవలు అందిస్తున్న దిగ్గజ క్రికెటర్ ను సన్మానించడం సంతోషం కలిగిస్తోందన్నారు రాజీవ్ శుక్లా.
ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఎంట్రీ ఇస్తున్నా ఇప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) వారితో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాడని, ఇదంతా ఆయనలో ఉన్న ఎనర్జీకి సలాం చెప్పాల్సిందేనంటూ పేర్కొన్నాడు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ .
ఇదిలా ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. ఇక ఇరు జట్లు చెరో పాయింట్ ను పొందాయి. మరో వైపు మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కామెంటేటర్ డాని మోరిసన్ ఈ సీజన్ మీకు ఆఖరిదా అంటూ ప్రశ్నించాడు. దీనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు ధోనీ. నేను కాదు మీరు నిర్ణయించుకున్నారంటూ పేర్కొన్నాడు.
Also Read : జితేశ్ శర్మ జోర్దార్ ఇన్నింగ్స్
