ముంబైలో ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలుపు అంచుల దాకా వచ్చి బోర్లా పడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. జట్టు పరంగా 5 వికెట్లు తీస్తే 4 వికెట్లు ఒక్కడే రషీద్ ఖాన్ తీశాడు. 4 ఓవర్లు వేసిన ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
సూర్య కుమార్ యాదవ్ దంచి కొట్టాడు. 49 బంతులు ఎదుర్కొని 103 రన్స్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 29 రన్స్ చేస్తే ఓపెనర్ ఇషాన్ కిషన్ 31 రన్స్ చేస్తే విష్ణు వినోద్ 30 రన్స్ తో ఆకట్టుకున్నాడు. అనంతరం 219 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 13 ఓవర్లు ముగిసే సరికి 108 రన్స్ చేసింది. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన రషీద్ ఖాన్ 3 ఫోర్లు 10 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 32 బంతులు ఎదుర్కొని 79 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. తన ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు.
ఇదిలా ఉండగా ఐపీఎల్ 16వ సీజన్ లో అత్యధిక వికెట్ల రేసులో టాప్ లో నిలిచాడు రషీద్ ఖాన్. అతడి తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యుజ్వేంద్ర చాహల్ ఉండగా ముంబై ఇండియన్స్ కు చెందిన స్పిన్నర్ పీయూష్ చావ్లా నిలిచాడు. ఇంకా లీగ్ జరగాల్సి ఉండడంతో ఎవరు లీగ్ లో టాపర్ గా నిలుస్తారనేది వేచి చూడాలి.
