డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంచలన కామెంట్స్ చేశారు. ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జట్టు గెలుపు అంచుల దాకా వచ్చి బోల్తా పడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ 31 రన్స్ చేస్తే రోహిత్ శర్మ 29 పరుగులతో ఆకట్టుకున్నారు. విష్ణు వినోద్ 30 రన్స్ చేసి రాణించాడు. రోహిత్ ఔట్ అయ్యాక మైదానంలోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ మరోసారి రెచ్చి పోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 103 పరుగులతో సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. కేవలం 49 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇందులో 11 ఫోర్లు 6 సిక్సర్లతో రెచ్చి పోయాడు. ఫోర్లు, సిక్సర్లతో 80 రన్స్ చేశాడు.
మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడాడు. ముంబై బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడంటూ కితాబు ఇచ్చాడు. తమ బౌలర్లు ఎంతగా ప్రయత్నం చేసినా ఆశించిన మేర రాణించ లేక పోయామన్నాడు. ఏది ఏమైనా సూర్యా భాయ్ ని తాను అభినందిస్తున్నట్లు చెప్పాడు హార్దిక్ పాండ్యా. ఈ సందర్భంగా సూర్య కుమార్ ను కరచాలనం చేశాడు హార్దిక్ పాండ్యా.
