రిషబ్ పంత్ గాయపడడంతో అతడి స్థానంలో డేవిడ్ వార్నర్ సారథ్యం వహించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆశించిన మేర రాణించ లేక పోయింది. ఢిల్లీ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో 31 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రధానంగా ఆసిస్ స్టార్ క్రికెటర్ వార్నర్ అద్భుతంగా ఆడాడు. కానీ జట్టు నుంచి ఆశించిన మేర రాణించ లేక పోయింది. మార్ష్ , సాల్ట్ మెరిసినా కీలక మ్యాచ్ లలో చేతులెత్తేసింది. పాయింట్ల పట్టికలో ఆఖరులో నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్.
ఇక పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించ లేక పోయింది. కెప్టెన్ వార్నర్ , సాల్ట్ మెరిసినా ఆ తర్వాత పంజాబ్ బౌలర్ల ధాటికి కుప్ప కూలింది. విచిత్రం ఏమిటంటే 16 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. హర్ ప్రీత్ బ్రార్ శాసించాడు ఢిల్లీని. అద్భుతమైన బౌలింగ్ తో చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. రాహుల్ చాహర్ 16 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.
ఆరంభం నుంచే అద్భుతంగా ప్రారంభించింది. 69 పరుగుల వరకు ఒక్క వికెట్ కోల్పోలేదు. ఆ తర్వాత వికెట్ల పతనం ప్రారంభమైంది. 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 రన్స్ చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఆడాడు. 27 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు ఒక సిక్సర్ తో రెచ్చి పోయాడు. ఫిల్ సాల్ట్ 21 రన్స్ చేశాడు. ఒక దశలో పటిష్టంగా కనిపించింది. కానీ ఎప్పుడైతే పంజాబ్ బౌలర్ హర్ ప్రీత్ బార్ బౌలింగ్ కు వచ్చాడో సీన్ మారింది.
