ఐపీఎల్ 16వ సీజన్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా పరుగుల వరద పారించడంలో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లు పోటీ పడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న యంగ్ స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. తన జట్టుకు కీలకమైన ఆటగాడిగా మారాడు.
ఇక వర్ధమాన ఆటగాళ్లకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ రోల్ మోడల్. ఆయన కనిపిస్తే చాలు వాలి పోతారు. తాజాగా అరుదైన గిఫ్ట్ దొరికింది యశస్వి జైస్వాల్ కు. రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా జైస్వాల్ జార్ఖండ్ డైనమెట్ ను కలుసుకున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీకి తాను ఇష్టపడి, నిత్యం వాడే అరుదైన బ్యాట్ ను ఇచ్చాడు. ఆ బ్యాట్ పై ఎంఎస్ ధోనీ సంతకం ఇవ్వాలని కోరాడు. యశస్వి జైస్వాల్ కు అరుదైన బహుమతి ఇచ్చాడు ధోనీ. ఆ గిఫ్ట్ ఏమిటంటే పరుగులు చేసే బ్యాట్ పై సంతకం. ఇందుకు సంబంధించిన ధోనీతో దిగిన ఫోటోను యశస్వి జైస్వాల్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. నిమిషాల్లోనే ఈ ఫోటో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా ఇటీవలే తాను ధోనీ, కోహ్లీ, శాంసన్ , రోహిత్ శర్మ నుంచి స్పూర్తి పొందుతానని స్పష్టం చేశాడు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్.
