ఐపీఎల్ లో ఊహించని రీతిలో భారీ తేడాతో ఓటమి పాలైంది రాజస్థాన్ రాయల్స్. జైపూర్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల ధాటికి కేవలం 59 పరుగులకే కుప్ప కూలింది. 112 పరుగులతో పరాజయం పాలైంది. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గత ఏడాది రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ జట్టు ఆశించిన రీతిలో ఆరంభంలో రాణించినా ఆ తర్వాత పేలవమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయం తప్పని తేలి పోయింది. మొదట్లో ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేసినా ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.
ఆర్సీబీ కెప్టెన్ ఫ్లాఫ్ డు ప్లెసిస్ 55, మాక్స్ వెల్ 54 రన్స్ చేశారు. ఆఖరులో వచ్చిన వికెట్ కీపర్ అనూజ్ రావత్ 10 బంతుల్లో 25 రన్స్ చేయడంతో భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ , మాక్స్ వెల్ కలిసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించేలా తోడ్పాటు అందించారు. విరాట్ కోహ్లీ స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘనత సాధించాడు. ఇదిలా ఉండగా ఇప్పటి దాకా ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవక పోవడం విశేషం.
