GT vs SRH IPL 2023 : గుజ‌రాత్ వ‌ర్సెస్ హైద‌రాబాద్ ఫైట్

ఈ మ్యాచ్ నామ మాత్ర‌మేనా

ఐపీఎల్ 16వ సీజ‌న్ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇప్ప‌టికే మూడు జ‌ట్లు ప్లే ఆఫ్ రేసులో నిలిచాయి. ఇక నాల్గో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెల‌కొంది. ఆర్సీబీ, కోల్ క‌తా, రాజ‌స్థాన్ మ‌ధ్య ఇంకా మ్యాచ్ లు ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప్లే ఆఫ్ కు చేరుకున్న గుజ‌రాత్ టైటాన్స్ ఇవాళ స‌న్ రైజ‌ర్స్ తో తన స్వంత మైదానంలో త‌ల‌ప‌డ‌నుంది. అటు బ్యాటింగ్ ప‌రంగా ఇటు బౌలింగ్ లో దుమ్ము రేపుతోంది గుజ‌రాత్.

హార్దిక్ పాండ్యా సేన జైత్ర‌యాత్ర‌కు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అడ్డుకట్ట వేస్తుందా అన్న‌ది వేచి చూడాలి. ఆ జ‌ట్టు ఐపీఎల్ నుంచి పూర్తిగా నిష్క్ర‌మించింది. ఈ మ్యాచ్ కేవ‌లం నామ‌మాత్ర‌మే. పోయిన ప‌రువు కాపాడు కోవాలంటే క‌నీసం ఈ మ్యాచ్ లోనైనా డిఫెండింగ్ ఛాంపియ‌న్ ను ఓడించాలి. జ‌ట్టు ప‌రంగా చూస్తే అంత సీన్ క‌నిపించ‌డం లేదు. ఏది ఏమైనా భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన ఎస్ ఆర్ హెచ్ సిఇఓ కావ్య మార‌న్ మాత్రం తీవ్ర నిరాశ‌లో ఉంది.

ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. గుజ‌రాత్ కు 16 పాయింట్లు ఉన్నాయి. ఆ జ‌ట్టు 8 మ్యాచ్ ల‌లో గెలుపొందింది. శుభ్ మ‌న్ గిల్ , సాహా, పాండ్యా, విజ‌య్ శంక‌ర్ తో పాటు డేవిడ్ మిల్ల‌ర్ ఉన్నారు. ఇక హైద‌రాబాద్ ప‌రంగా చూస్తే అభిషేక్ శ‌ర్మ‌, అన్మోల్ ప్రీత్ సింగ్ , రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ , గ్లెన్ ఫిలిప్స్ , హ్యారీ బ్రూక్ ఏ స‌మ‌యంలోనైనా స‌త్తా చాట‌నున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!