Open AI CEO PM Modi : మోదీని క‌లిసిన ఏఐ సిఇఓ

టెక్నాల‌జీలో కీల‌క పాత్ర

Open AI CEO PM Modi : ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ‌) కీల‌క పాత్ర పోషిస్తోంది. ఓపెన్ ఏఐ సృష్టిక‌ర్త సిఇఓ సామ్ ఆల్ట్ మ‌న్(Sam Altman) శుక్ర‌వారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏఐ గురించి వివ‌రించారు పీఎంకు. సామ్ అల్ట్ మ‌న్ భార‌త దేశం తో పాటు ఇజ్రాయెల్ , ఖ‌తార్ , యూఏఈ, జోర్డాన్ , ద‌క్షిణ కొరియాతో స‌హా ఇత‌ర దేశాల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.

ముందు చూపు, భవిష్య‌త్తు క‌లిగిన నాయ‌కుడు , ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో క‌ల‌వ‌డం త‌న‌కు సంతోషంగా ఉంద‌న్నారు ఏఐ సిఇఓ ఆల్ట్ మ‌న్. ఇదిలా ఉండ‌గా టెక్ ఎకో సిస్ట‌మ్ లో ఏఐ కీల‌క పాత్ర పోషిస్తోంద‌న్నారు న‌రేంద్ర మోదీ. డిజిట‌ల్ టెక్నాల‌జీలో భార‌త్ టాప్ లో కొన‌సాగుతోంది. ఇందుకు సంబంధించి ఏఐ ఎన‌లేని స‌హ‌కారం అంద‌జేస్తోంద‌న్నారు పీఎం.

ప్ర‌స్తుతం ఏఐ దెబ్బ‌కు ఇత‌ర ఐటీ కంపెనీలు విల విల లాడుతున్నాయి. ల‌క్ష‌లాది మంది త‌మ ఉద్యోగాలు కోల్పోతున్నారు. అమెరికాలోని కంపెనీలు ఎక్కువ‌గా ఏఐని ఆధారంగా చేసుకుని వేలాది మందిని తొల‌గించాయి. ఇక సాంకేతిక ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లో ఏఐ అనేది కీల‌క పాత్ర పోషించ‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు పీఎం.

కాగా ఢిల్లీ లోని ఐఐఐటీలో ఇవాళ ప్ర‌త్యేక సెష‌న్ జ‌రిగింది. దేశం ముందు ఏఐ ప‌రంగా ఉన్న అవ‌కాశాల గురించి , ఏం చేయాల‌నే దాని గురించి చ‌ర్చించిన‌ట్లు ఈ సంద‌ర్భంగా తెలిపారు ఏఐ సిఇఓ ఆల్ట్ మాన్.

Also Read : Bandi Sanjay PM Modi : కేంద్ర స‌ర్కార్ కు బండి థ్యాంక్స్

 

Leave A Reply

Your Email Id will not be published!