Wrestlers Slams : ఆసియా క్రీడ‌ల‌ను బ‌హిష్క‌రిస్తాం – రెజ్ల‌ర్లు

కేంద్రానికి మ‌రోసారి అల్టిమేటం

Wrestlers Slams : లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై నిప్పులు చెరిగారు మ‌హిళా రెజ్ల‌ర్లు. కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. శ‌నివారం హ‌ర్యానా లోని సోనిప‌ట్ లో ఖాప్ నాయ‌కుల‌తో మ‌హా పంచాయ‌త్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా రెజ్ల‌ర్లు(Wrestlers) మీడియాతో మాట్లాడారు. రాజ‌కీయ‌, ఆర్థిక‌, అంగ బ‌లం చూసుకుని బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ రెచ్చి పోతున్నార‌ని ఆరోపించారు. త‌మ‌ను మాన‌సికంగా, శారీరకంగా, లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ‌త ఏప్రిల్ 23 నుంచి ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న దీక్ష‌కు దిగారు. ఢిల్లీ పోలీసులు దారుణంగా ప్ర‌వ‌ర్తించారు. వారి ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. దీనిపై యావ‌త్ దేశం మండిప‌డింది. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది కేంద్రం. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై చ‌ర్య తీసుకున్న పాపాన పోలేదు. దీనిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఈ త‌రుణంలో సంయుక్త కిసాన్ మోర్చా, భార‌తీయ కిసాన్ మోర్చా రైతు సంఘాల నేత‌లు బేష‌ర‌తు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు మ‌హిళా రెజ‌ర్ల ఆందోళ‌న‌కు. ఈనెల 15 వ‌ర‌కు డెడ్ లైన్ విధించామ‌ని ఆ లోపు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక పోతే తాము ఆసియా క్రీడ‌ల‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చరించారు రెజ్ల‌ర్లు.

Also Read : Wrestlers Protest : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ బెదిరింపులు – సాక్షి మాలిక్

 

Leave A Reply

Your Email Id will not be published!