Chiranjeevi : ఎవరినైనా సరే అభినందించాలంటే మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరినీ ప్రేమిస్తారు. ఆదరిస్తారు మెగాస్టార్. అందుకే ఆయనకు ఎనలేని అభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈ మధ్య ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు చిరంజీవి. తనకు సంబంధించిన విషయమైనా లేదా ఇతరులకు సంబంధించిన ప్రత్యేకతలు ఏమైనా ఉంటే వెంటనే అభినందించడం లేదా వ్యాఖ్యానించడం లేదా స్పూర్తి దాయకంగా ఉండేలా పోస్ట్ చేస్తున్నారు.
జూన్ 14న మెగా ఫ్యామిలీలో అత్యంత ముఖ్యమైన రోజు. ఎందుకంటే తన తనయుడు , ప్రముఖ నటుడు రామ్ చరణ్ , అపోలో వైద్య సంస్థల చైర్మన్ మనుమరాలు ఉపాసనా రెడ్డి పెళ్లి రోజు. వారి వివాహమై ఇవాల్టితో 14 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ తన కోడలు, కొడుకుకు వివాహపు రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు చిరంజీవి(Chiranjeevi).
ఇది మీకే కాదు మాకందరికీ, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి అత్యంత ముఖ్యమైన రోజు. ఈ ప్రత్యేకమైన దినం సందర్బంగా మీ ఇద్దరికీ వివాహ వార్షకోత్సవ శుభాకాంక్షలు అంటూ అభినందనలతో ముంచెత్తారు మెగాస్టార్ చిరంజీవి. అంతే కాదు మీ ఇద్దరూ మమ్మల్ని గర్వ పడేలా, ఉన్నతంగా సంతోష పరిచారంటూ కొనియాడారు.
Also Read : Sree Leela First Look : శ్రీలీల ఫస్ట్ లుక్ కెవ్వు కేక