Actor Vijay : ప్ర‌తిభావంతుల‌కు విజ‌య్ చేయూత‌

వంద‌కు వంద శాతం సాధించిన నందిని

Actor Vijay : త‌ళ‌ప‌తి విజ‌య్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కోలీవుడ్ లోనే కాదు యావ‌త్ భార‌త దేశ సినీ రంగంలో ద‌క్షిణాదికి సంబంధించి మోస్ట్ పాపుల‌ర్ హీరో గా గుర్తింపు పొందారు విజ‌య్. ఆయ‌న ఏ సినిమా తీసినా అది బాక్సాఫీసు బ‌ద్ద‌లు కావాల్సిందే. డిఫ‌రెంట్ మేన‌రిజంతో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఈ న‌టుడు.

ద‌క్షిణాది సినీ రంగ చ‌రిత్ర‌లో అత్య‌ధిక పారితోషకం తీసుకునే న‌టుడిగా విజ‌య్ గుర్తింపు పొందారు. ఆయ‌న‌కు లెక్క‌లేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ప్ర‌పంచ వ్యాప్తంగా. ఓ వైపు ర‌జ‌నీకాంత్ మ‌రో వైపు విజ‌య్ పోటా పోటీగా న‌టిస్తూ ముందుకు వెళుతున్నారు.

ఇదిలా ఉండ‌గా త‌న‌కు వ‌చ్చిన దాంట్లోంది దాతృత్వ సేవ‌ల‌కు వినియోగిస్తుంటారు త‌ళ‌ప‌తి విజ‌య్(Vijay). ఆయ‌న ప్ర‌తి ఏటా ప్ర‌తిభావంతులైన విద్యార్థుల‌కు ప్ర‌శంసా ప‌త్రాలతో పాటు కొంత న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌జేస్తారు. తాజాగా 12వ త‌ర‌గ‌తి సాధార‌ణ ప‌రీక్ష‌లో 600 మార్కుల‌కు గాను 600 మార్కులు తెచ్చుకుని చ‌రిత్ర సృష్టించింది నందిని అనే విద్యార్థిని.

ఏకంగా త‌మిళ‌నాడులో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది దిండిగ‌ల్ జిల్లాకు చెందిన ఈ విద్యార్థిని. ఆమెను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్. ఆయ‌న కొంత కాలం నుంచీ సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్నారు.

Also Read : Manipur Files : సిరియాను గుర్తుకు తెస్తున్న మ‌ణిపూర్

Leave A Reply

Your Email Id will not be published!