Wrestlers Protest : మేం డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ కు వ్య‌తిరేకం

మా పోరాటం కేంద్ర ప్ర‌భుత్వంపై కాదు

Wrestlers Protest : మ‌హిళా రెజ్ల‌ర్ల పోరాటం కొన‌సాగుతూనే ఉంది. ఈనెల 15 లోపు భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య (డ‌బ్ల్యూఎఫ్ఐ) చీఫ్ , యూపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ సింగ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఆయ‌న‌ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ వ‌చ్చారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం స్పందించ‌న పాపాన పోలేదు.

శ‌నివారం మ‌హిళా రెజ్ల‌ర్లు(Wrestlers) జాతీయ మీడియాతో మాట్లాడారు. త‌మ పోరాటం కేంద్రంలో కొలువు తీరిన న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ పై కాద‌ని స్ప‌ష్టం చేశారు మ‌హిళా రెజ్ల‌ర్ సాక్షి మాలిక్ , రెజ్ల‌ర్ స‌త్య‌వ‌ర్త క‌డియ‌న్ . ఈ మేర‌కు వీడియో సందేశం కూడా విడుద‌ల చేశారు. సామాజిక మాధ్య‌మాల‌లో ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

లైంగికంగా, మాన‌సికంగా, శారీర‌కంగా డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ వేధింపుల‌కు గురి చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆపై ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 30 మంది మ‌హిళా రెజ్ల‌ర్లు ఆందోళ‌న బాట ప‌ట్టారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్ వేదిక‌గా నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు.

వారిపై ఢిల్లీకి చెందిన ఖాకీలు అమానుషంగా ప్ర‌వర్తించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవ‌డంతో చివ‌ర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ మేర‌కు జూన్ 15 లోపు నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది కోర్టు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేక పోయింది. దీనిపై మ‌రోసారి రెజ్ల‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు.

Also Read : Perni Nani : పార్టీ గుర్తు లేనోడీకి ప‌వ‌ర్ ఎట్లా

Leave A Reply

Your Email Id will not be published!