Manipur Violence Comment : మణిపూర్ లో ఆరని మంటలు
విద్వేషపు తాకిడికి ప్రాణాలు విలవిల
Manipur Violence Comment : మణిపూర్ రగులుతోంది. మంటల్లో కాలి పోతోంది. ఆగ్రహ జ్వాలలు ఓ వైపు విద్వేషపు జాడలు మరో వైపు. భద్రతా బలగాలు కొలువు తీరినా అల్లర్లు అదుపులోకి రావడం లేదు. ఎవరు ఎప్పుడు దాడికి పాల్పడతారో ..ఎప్పుడు ప్రాణాలు కోల్పోతామో తెలియని స్థితిలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. చివరకు శ్వాస కూడా పీల్చుకునేందుకు ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి. ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ షా అక్కడికి వెళ్లారు. ఇరు వర్గాల వారిని సముదాయించారు. ఆపై పెద్దలతో ములాఖత్ అయ్యారు. అంతా కంట్రోల్ లో ఉందని చెప్పేశారు. ఢిల్లీలో కాలు మోపే సరికల్లా మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి.
భారత దేశానికి చెందిన మాజీ ఆర్మీ అధికారులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్(Manipur) ను చూస్తుంటే సిరియా, లిబియా సంక్షోభం గుర్తుకు వస్తోందని పేర్కొన్నారు. అసలు మణిపూర్(Manipur) లో పాలన సాగిస్తున్నది ఎవరు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీనే. ఓ వైపు అస్సాం ఇంకో వైపు మణిపూర్ ఇలా ప్రతి చోటా ఏదో ఒక సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకు పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనే దాఖలాలు కనిపించడం లేదు. ఇంత వరకు జరిగిన నిరంతర ఘర్షణల్లో 96 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 25 మంది మేటి సంఘం సభ్యులు ఉండగా 63 మంది కుకీ సంఘం సభ్యులు ఉన్నారు. వీరు కాకుండా మరో 8 మంది బాధితులకు సంబంధించిన ఆచూకీ లభించ లేదు.
గత కొంత కాలంగా పక్కా ప్లాన్ తో ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు 17 ఆలయాలు ధ్వంసం కాగా ఏకంగా 221కి పైగా చర్చీలు దగ్ధమయ్యాయి. ఈ మొత్తం ఘర్షణల్లో 1,988 మేటీ సామాజిక వర్గానికి చెందిన వారి గృహాలు ధ్వంసం కాగా ఇక 1,425 కుకీ గృహాలు కోల్పోయారు. 158కి పైగా మెయిటీ ఆధిపత్య గ్రామాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. 50,000 వేల మందికి పైగా మణిపూర్(Manipur) ను వదిలి వెళ్లారు ప్రాణ భయంతో. గత మే 3న ఇంఫాల్ లోయలో నివసించే మెజారిటీ ప్రజలు , గిరిజన సమాజానికి మధ్య జాతి ఘర్షణ చోటు చేసుకుంది. అదే చివరకు మంటలు రాజేసింది. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మైతీ డిమాండ్ పై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ సంఘీ భావ యాత్రను చేపట్టింది. ఘర్షణకు దారి తీసింది. లా అండ్ ఆర్డర్ ను అదుపులోకి తీసుకు వచ్చేందుకు 10 వేల మందికి భద్రతా దళాలు కొలువు తీరాయి. చాలా రోజుల పాటు బాహ్య ప్రపంచానికి ఇంటర్నెట్ బంధాన్ని కట్ చేసింది. 144 సెక్షన్ ను అమలు చేశారు. జాతుల మధ్య ఘర్షణ తప్ప దీని వెనుక ఉగ్రవాదుల కుట్ర కోణం లేనే లేదని ఆర్మీ స్పష్టం చేసింది. మెయిటీలు హిందువులు కాగా కుకీలు క్రిష్టియన్లు, ఇతర కులాల వారు ఉన్నారు. మొత్తంగా మెయిటీకి రిజర్వేషన్ హోదా ఇవ్వడాన్ని కుకీ గిరిజన సామాజిక వర్గం వ్యతిరేకిస్తోంది. ఇదే ఇప్పుడు ఆగ్రహజ్వాలలు ఎగలిసి పడేలా చేసింది. ఈ జాతుల మధ్య వైరం ఎంత దాకా వెళుతుందో వేచి చూడాలి.
Also Read : Wrestlers Protest : మేం డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కు వ్యతిరేకం
