MP Vijay Sai Reddy : జగన్ సంకల్పం అభివృద్దికి సోపానం
వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి
MP Vijay Sai Reddy : అపారమైన వనరులను గుర్తించి వాటిని సద్వినియోగం చేసే ప్రయత్నం చేసిన ఘనత ఒక్క ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు వైస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి(MP Vijay Sai Reddy). బుధవారం ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దానిని తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది ఎవరో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు.
మనకు హైదరాబాద్ లాంటి ఐటీ నగరం లేక పోయినా ఇప్పుడు ఏపీలో తాము పవర్ లోకి వచ్చాక సీన్ మారిందన్నారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయని , మరికొన్ని భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు. కొందరు కళ్లున్నా చూడలేని ప్రబుద్దులు కావాలని పదే పదే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఇది మానుకోవాలని అన్నారు.
ప్రతిపక్షాలు మొత్తం ఏకమైనా బలమైన బాహుబలి లాంటి జగన్ మోహన్ రెడ్డిని ఢీకొనే సత్తా లేదని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఐటీని విస్తరించే పనిలో తమ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టిందని పేర్కొన్నారు. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుందని ఆశా భావం వ్యక్తం చేశారు .
Also Read : Guntur Railway Junction : 9 రోజుల పాటు పలు రైళ్లు రద్దు
