RS Praveen Kumar : బీఎస్పీలో మ‌హిళలు కీల‌కం – ఆర్ఎస్పీ

మ‌హిళా క‌న్వీన‌ర్ల తో స‌మావేశం

RS Praveen Kumar : బ‌హుజ‌న స‌మాజ్ పార్టీలో మ‌హిళ‌లు కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. దక్షిణ తెలంగాణ జిల్లాల మ‌హిళా క‌న్వీన‌ర్లకు సంబంధించి క్యాంపు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హాజ‌రైన మ‌హిళా క‌న్వీన‌ర్ల‌కు వివిధ అంశాల‌పై శిక్ష‌ణ ఇచ్చారు. ప్ర‌ధానంగా భార‌త రాజ్యాంగం, దాని ప్రాధాన్య‌త‌, విధి విధానాలు, పార్టీ అనుస‌రిస్తున్న వ్యూహాలు, కార్య‌క్ర‌మాల గురించి వివ‌రించారు బీఎస్పీ చీఫ్‌. మ‌హిళ‌లు లేకుండా ఈ స‌మాజం లేద‌న్నారు. ప్ర‌తి ప‌నిలో వారి భాగ‌స్వామ్యం ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar).

పార్టీ ప‌రంగా బ‌లోపేతం చేసేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నార‌ని ప్రశంసలు కురిపించారు. రాబోయే రోజుల్లో పార్టీ ప‌రంగా స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు. బీఎస్పీ జాతీయ అధ్య‌క్షురాలు, మాజీ సీఎం మాయావ‌తి క‌ల‌ల‌ను నిజం చేసేందుకు మీరంతా మ‌రింత‌గా కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు కేటీఆర్.

ఇప్ప‌టి దాకా రాత్రింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తున్నార‌ని ఇదే స్పూర్తిని రాబోయే రోజుల్లో కూడా కొన‌సాగించాల‌ని సూచించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. రాబోయే బ‌హుజ‌న రాజ్యంలో మీ భూమిక అత్యంత చారిత్రాత్మ‌కంగా ఉండ బోతోంద‌ని బీఎస్పీ చీఫ్ ఆశా భావం వ్య‌క్తం చేశారు.

Also Read : Bandi Sanjay Slams : కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్క‌టే – బండి

Leave A Reply

Your Email Id will not be published!