KC Venu Gopal : బెంగ‌ళూరులో పీడీఎఫ్ స‌మావేశం

వెల్ల‌డించిన కేసీ వేణు గోపాల్

KC Venu Gopal : బీహార్ రాజ‌ధాని పాట్నాలో ప్ర‌తిప‌క్షాలన్నీ (పీడీఎఫ్‌) ఏక‌మై ఒకే వేదిక‌పైకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేశాయి. ఇందులో 17 పార్టీలకు చెందిన‌నేత‌లు పాల్గొన్నారు. త‌దుప‌రి స‌మావేశాన్ని ఈనెల‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని రాజ‌ధాని సిమ్లాలో చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ కీల‌క‌మైన విప‌క్షాల మీటింగ్ కు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్.

ఇదిలా ఉండగా కీల‌క స‌మావేశాన్ని సిమ్లాకు బ‌దులు జూలై 17, 18వ తేదీల్లో బెంగ‌ళూరులో నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal). సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని తెలిపారు. ఫాసిస్ట్ , అప్ర‌జాస్వామిక శ‌క్తుల‌ను ఓడించేందుకు , దేశాన్ని ముందుకు తీసుకు వెళ్ల‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు.

క‌ర్ణాట‌క రాజ‌ధానిలో జ‌రిగే ముఖ్య భేటీలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తో పాటు సీఎంలు ఎంకే స్టాలిన్ , మ‌మ‌తా బెన‌ర్జీ, అరవింద్ కేజ్రీవాల్ , హేమంత్ సోరేన్ , ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ , శివ సేన బాల్ థాక్రే చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే, కేర‌ళ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ , ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , స‌మాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాద‌వ్ త‌దిత‌రులు హాజ‌రు కానున్న‌ట్లు తెలిపారు కేసీ వేణుగోపాల్.

ఇదిలా ఉండ‌గా భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ ను తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేదంటూ ప్ర‌క‌టించారు రాహుల్ గాంధీ.

Also Read : Rahul Gandhi Viral : రాహుల్ గాంధీ వైర‌ల్

 

Leave A Reply

Your Email Id will not be published!