PM Modi Viral : ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి కాంగ్రెస్ , ఆప్. సోమవారం ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రస్తుతం మోదీ పేరుతో ఉన్న నిర్మా పౌడర్ తో ఉన్న ఫోటో షేర్ చేశాయి. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. గతంలో భారత రాష్ట్ర సమితి పార్టీ సైతం మోదీని నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా పేరుతో పోస్టర్స్ , హోర్డింగ్స్ తో హోరెత్తించింది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో సైతం మోదీ నిర్మా బ్యానర్లతో హోరెత్తించారు.
తాజాగా మోదీ నిర్మా పౌడర్ పోస్టర్ హల్ చల్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొలువు తీరిన ప్రధాని(PM Modi) ప్రజలకు మాయ మాటలు చెప్పారని, నిర్మా కడిగినట్లు నాశనం చేశారంటూ ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశాడని, తనకు అనుకూలంగా ఉన్న వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చేలా చేస్తున్నాడంటూ మండిపడ్డారు.
దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించింది.
Also Read : KC Venu Gopal : బెంగళూరులో పీడీఎఫ్ సమావేశం
