Niharika Chaitanya : ప్లీజ్ మాక్కొంచెం ప్రైవసీ కావాలి
కొణిదెల నిహారిక కామెంట్స్
Niharika Chaitanya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు మెగాస్టార్ చిరంజీవి తనయుడు నాగేంద్ర బాబు తనయురాలు కొణిదెల నిహారిక. ప్రముఖ వ్యాపారవేత్త తనయుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్దరూ చెట్టా పట్టాలు వేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో తెగ ఫోటోలు షేర్ చేశారు.
చివరకు ఈ ఏడాది మార్చి నెలలో ఇన్ స్టా గ్రామ్ లో తన ఖాతా లోంచి ప్రత్యేకించి నిహారిక కొణిదెలకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను తొలగించాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, త్వరలో విడాకులు తీసుకో బోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరకు నిహారిక కొణిదెల, చైతన్య జొన్నల గడ్డ కలిసి విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వేర్వేరుగా.
చివరకు కేసు విచారించిన కుటుంబ ఫోర్టు నిహారిక కొణిదెలకు(Niharika Konidela) , చైతన్య జొన్నల గడ్డకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు డిక్రీ కూడా మంజూరు చేసింది. దీంతో ఇద్దరూ అధికారికంగా (కోర్టు పరంగా ) ఎలాంటి అడ్డంకులు లేకుండా విడాకులు వచ్చాయి.
ఇదిలా ఉండగా వీరిద్దరి మధ్య ఎందుకు భేదాభిప్రాయాలు వచ్చాయనేది ఇంకా తెలియ రాలేదు. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు నిహారిక, చైతన్యలు. ఇద్దరం ఒక అబిప్రాయానికి వచ్చామని, అందుకే విడాకులు తీసుకున్నామని తెలిపారు. దయచేసి తమకు కొంత కాలం పాటు ఏకాంతం కావాలని స్పష్టం చేశారు.
Also Read : BJP Cabinet Meeting : బీజేపీ కేబినెట్ కీలక భేటీ
