Meta Threads Comment : థ్రెడ్స్ జోష్ ట్విట్టర్ షాక్
పిట్టకూతకు ప్రత్యామ్నాయం కానుందా
Meta Threads Comment : ఇద్దరు కుబేరుల మధ్య పోటీ నెలకొంటే ఎలా ఉంటుందో తెలుసు కోవాలని ఉందా. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా యుద్దం మొదలైంది. ప్రస్తుతం యావత్ ప్రపంచం పిట్ట కూత (ట్విట్టర్ )లో మునిగి పోయింది. అది లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నారు కోట్లాది మంది నెటిజన్లు. ఇక ఇటీవలి కాలంలో టెక్నాలజీ పరంగా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతున్నాయి. వీటిలో గూగుల్(Google) , యూట్యూబ్ , ఫేస్ బుక్ మెటా , వాట్సాప్ , టెలిగ్రామ్ , టంబ్లర్..లింక్డ ఇన్ ..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంస్థలు దుమ్ము రేపుతున్నాయి. కోట్లాది మందిని మెస్మరైజ్ చేస్తున్నాయి. వీడియోలతో పాటు ఈ మధ్యన రీల్స్ , మీమ్స్ టాప్ లో కొనసాగుతున్నాయి.
నిన్నటి దాకా టాప్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్న దిగ్గజ ఐటీ, సోషల్ మీడియా సంస్థలన్నీ ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యేందుకు ఫోకస్ పెడుతున్నాయి. లేక పోతే వెనుకబడి పోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతానికి ఎన్ని కొత్తగా సంస్థలు పుట్టుకు వచ్చినా చివరకు ట్విట్టర్ ను ఢీకొనలేక పోతున్నాయి. ఇప్పటి వరకు కొన్ని దరి దాపుల్లోకి వచ్చేందు నానా తంటాలు పడ్డాయి. కానీ ఇన్ స్టంట్ మెస్సేజ్ లు పంచుకునే సదుపాయంతో పాటు క్షణాల్లోనే వరల్డ్ వైడ్ గా అభిప్రాయలు పంచుకునే ప్లాట్ ఫారమ్ గా ఉపయోగ పడుతుండడంతో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇక ఏ సంస్థకైనా సబ్ స్కైబర్లు, నెటిజన్లు ముఖ్యం. యాక్సెస బిలిటీ కూడా ప్రధానం.
ఇదే క్రమంలో టంబ్లర్ సైతం ఆ మధ్యన ప్రస్తావనకు వచ్చింది. ఇదే క్రమంలో ఇటీవలి టెక్నాలజీలో చోటు చేసుకున్న అతి పెద్ద విస్పోటనం, పరిణామం ఏమిటంటే చాట్ జీపీటీ (AI) రావడం. దీని దెబ్బకు దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ సైతం ఒడిదుడులకు లోనైంది. దాని షేర్లు కూడా పడి పోయాయి. దీనిని ఎదుర్కొనేందుకు బార్డ్ ఏఐని తీసుకు వచ్చింది గూగుల్(Google). ఇది కూడా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్. దీనిని టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్ టేకోవర్ చేసుకున్నాడు. కీలక మార్పులు తీసుకు వచ్చాడు. ఫక్తు వ్యాపార దృక్ఫథాన్ని కలిగి ఉన్న మస్క్ రాబోయే రోజుల్లో మరి కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించాడు. సేవలకు సంబంధించి కొంత ఫీజులు కూడా వసూలు చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ తరుణంలో ఫేస్ బుక్ – మెటా ఫౌండర్ , సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన ప్రకటన చేశాడు. ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా మరింత సులువుగా, ప్రతి ఒక్కరు తమను తాము ప్రజెంట్ చేసుకునేలా – థ్రెడ్స్ – ను తీసుకు వస్తున్నట్లు వెల్లడించాడు. ఆయన చేసిన ఈ ప్రకటన ప్రపంచాన్ని ఒక్కసారిగా విస్తు పోయేలా చేసింది. ట్రయల్ బేసిస్ గా జూలై 6న ప్రారంభించనున్నట్లు తెలిపాడు జుకర్ బర్గ్. ఇది పూర్తిగా ట్విట్టర్ కు ప్రత్యామ్నాయం కానుందని టెక్కీలు పేర్కొంటున్నారు. మీదైన ప్రపంచం కోసం వేచి చూస్తున్నారా. మీరు క్రియేటిర్స్ గా మారాలని అనుకుంటున్నారా..ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవాలని ఉందా..అయితే ఇంకెందుకు ఆలస్యం కొత్త ప్రపంచం మీకు పరిచయం చేస్తోంది మెటా థ్రెడ్స్ అని ప్రకటించారు బర్గ్. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.
Also Read : CM KCR : 8 వైద్య కళాశాలలకు పచ్చ జెండా
