KTR Viral : భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , తెలంగాణ ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాబోయే రోజుల్లో ఆయన కేసీఆర్ తర్వాత సీఎంగా కొలువు తీరుతారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా పక్కన పెడితే మోస్ట్ పవర్ ఫుల్ , డైనమిక్ లీడర్ గా ఎదిగారు కేటీఆర్. రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీని గుర్తించిన కేటీఆర్ ఎక్కువగా ఐటీ ఆధారిత పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ దిశగా ఆయన సక్సెస్ అయ్యారు.
సీఎం ఆధ్వర్యంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు వచ్చేలా చేశారు. దీని వల్ల భారీ ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు, బడా టైకూన్స్ హైదరాబాద్ ను ఎంచుకుంటున్నారు. కేటీఆర్(KTR) కూడా తండ్రి కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నారు. ఆయన అమెరికాలో చదువు కోవడం వల్ల ఆంగ్లంలో ఇటు తెలంగాణ యాస, భాషతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూడు భాషల్లో ప్రావీణ్యం కూడా ఉంది కేటీఆర్ కు.
తాజాగా కేటీఆర్ వైరల్ గా మారారు. ఆయన ఇటీవల కళ్లద్దాలతో దిగిన ఫోటోను షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఎంతైనా కేటీఆర్ మజాకా అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన ఫ్యాన్స్.
Also Read : Justice Alok Aradhe : తెలంగాణ హైకోర్టు సీజేగా అలోక్ ఆరాధే
