Sourav Ganguly : సౌర‌వ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్

జ‌ట్టు ప‌ర్ ఫార్మెన్స్ పై ఫోక‌స్ పెట్టాలి

Sourav Ganguly : బీసీసీఐ మాజీ బాస్ సౌర‌వ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే టోర్నీల‌కు సంబంధించి భార‌త జ‌ట్టు నిరాశ‌జ‌న‌క‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టడంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌రింత రాటు దేలాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. జాతీయ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆట‌గాళ్ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇప్ప‌టికే బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. చేత‌న్ శ‌ర్మ‌ను త‌ప్పించింది. ఆయ‌న స్థానంలో భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆల్ రౌండ‌ర్ అజిత్ అగార్క‌ర్ ను ఎంపిక చేసింది. జూలై 12 నుండి వెస్టిండీస్ లో 2 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడ‌నుంది భార‌త జ‌ట్టు. ఇప్ప‌టికే బీసీసీఐ టెస్టు జ‌ట్టును ఎంపిక చేస్తే కొత్త‌గా కొలువు తీరిన అజిత్ అగార్క‌ర్ ఆధ్వ‌ర్యంలో వ‌న్డే, టి20 జ‌ట్ల‌కు సంబంధించి వేర్వేరుగా ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది. వ‌న్డే , టి20కి స్కిప్ప‌ర్ గా ముంబైకి చెందిన హార్దిక్ పాండ్యాకు అప్ప‌గించింది.

తాజాగా జ‌ట్ల ఎంపిక‌పై, ఆట‌గాళ్ల ప‌ర్ ఫార్మెన్స్ పై బీసీసీఐ మాజీ చీఫ్ సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. గ‌తంలో కంటే ఆట‌పై మ‌రింత ఫోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మ‌రో వైపు అగార్క‌ర్ ఎంపిక చేసిన తీరుపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఐపీఎల్ లో స‌త్తా చాటిన యూపీ కుర్రాడు రింకూ సింగ్ ను ఎందుకు ఎంపిక చేయ‌లేదంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

Also Read : Puvvada Ajay Kumar : పొంగులేటి నోరు జ‌ర జాగ్ర‌త్త – పువ్వాడ‌

Leave A Reply

Your Email Id will not be published!