Akhanda Parayanam : తిరుమలలో అఖండ పారాయణం
రామ నామ స్మరణతో అయోధ్యకాండ
Akhanda Parayanam : తిరుమల క్షేత్రం రామ నామ స్మరణతో మారమ్రోగింది. అయోధ్య కాండ అఖండ పారాయణం సాగింది. తిరుమల నాద నీరాజనం వేదికపై ఆదివారం ఉదయం 7 గంటల నుడి 9 గంటల వరకు ఒకటో విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్త జనరంజకంగా సాగింది. శ్రీ హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం రామ నామ స్మరణతో జరిగింది.
ఇందులో 1 నుండి 3 సర్గల వరకు గల 156 శ్లోకాలను పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా భక్తులు వారిని అనుసరించి శ్లోక పారాయణం నిర్వహించారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు ఆచార్య రామానుజాచార్యలుఉ, శ్రీ అనంత గోపాల కృష్ణ , శ్రీ పీవీఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల , శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయానికి చెందిన పండితులు పాల్గొన్నారు.
పారాయణం ప్రారంభానికి ముందు టీటీడీ(TTD) అన్నామాచర్య ప్రాజెక్టు కళాకారులు ఉదయ భాస్కర్ బృందం , హైదరాబాద్ కు చెందిన నాగరాజు టీం భజన కీర్తలను శ్రవణానందంగా ఆలాపించారు.
Also Read : DK Shiva Kumar : ఇందిరమ్మ క్యాంటీన్ లో డీకే శివకుమార్
