Sourav Ganguly : ఆ ఇద్దరిని ఎందుకు తప్పించారు – గంగూలీ
ప్రశ్నించిన బీసీసీఐ మాజీ చీఫ్
Sourav Ganguly : బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా విండీస్ టూర్ లో వన్డే, టి20 సీరీస్ లకు ఎందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తప్పించారంటూ నిలదీశాడు. ఇప్పటికే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా మాజీ భారత ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. ఆయన బాధ్యతలు స్వీకరించాక విండీస్ టూర్ లో పాల్గొనే వన్డే సీరీస్, టి20 జట్లను డిక్లేర్ చేశాడు. ఇక టెస్టు జట్టుకు సంబంధించి బీసీసీఐ ఎంపిక చేసింది.
ఇదిలా ఉండగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ , ఫామ్ లో ఉన్న మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీని తప్పించాడు తజిత్ అగార్కర్. దీనిపై తీవ్రంగా స్పందించాడు గంగూలీ(Sourav Ganguly). ఇద్దరినీ ఏ బేసిస్ లో తప్పించారో సెలెక్షన్ కమిటీ చైర్మన్ చెప్పాలన్నాడు. ఎవరైనా ఫామ్ లో లేక పోతే ఎంపిక చేయరని కానీ ఇద్దరూ ఫామ్ లో ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టారంటూ ప్రశ్నించాడు బీసీసీఐ మాజీ బాస్.
వన్డే జట్టుతో పాటు టి20 జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది. మరో వైపు తొండ కండరాలు పట్టేయడంతో కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయలేదని అగార్కర్ చెప్పాడు. మొత్తంగా ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను ఎంపిక చేయక పోవడం ప్రస్తుతం చర్చకు దారి తీసేలా చేసింది. ఏది ఏమైనా బీసీసీఐ ఎంపిక వ్యవహారం ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారడం విశేషం.
Also Read : Dasoju Sravan : రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్
