ED Chief Supreme Comment : మార‌ని కేంద్రం ‘సుప్రీం’ ఆగ్ర‌హం

ఈడీ చీఫ్ పొడిగింపు ఒప్పుకోం

ED Chief Supreme Comment : స‌ర్వోన్న‌త న్యాయ స్థానం ప‌దే ప‌దే మోదీ ప్రభుత్వాన్ని ప్ర‌శ్నిస్తోంది. నిల‌దీస్తోంది. నిగ్గ‌దీసి అడుగుతోంది. శల్య ప‌రీక్ష చేయాల్సిన స్థితికి దిగ‌జారిపోతే ఎలా అంటూ మండిప‌డుతోంది. గ‌త కొంత కాలంగా న్యాయ వ్య‌వ‌స్థ‌కు కేంద్ర స‌ర్కార్ కు పొస‌గ‌డం లేదు. ఎవ‌రు ఎక్కువ ఎవ‌రు త‌క్కువ అనే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది కేంద్రం. ప్ర‌ధానంగా ఎప్పుడైతే జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొలువు తీరారో ఆనాటి నుంచీ కేంద్రానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. చివ‌ర‌కు మోదీ త‌న కేబినెట్ లో క్లీన్ ఇమేజ్ క‌లిగిన కిరెన్ రిజిజును న్యాయ శాఖ మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించాల్సి వ‌చ్చింది. దీని వెనుక కార‌ణాలు ఏమై ఉంటాయ‌న్న‌ది ప‌క్క‌న పెడితే సుప్రీంకోర్టు(Supreme Court) సంచ‌ల‌న తీర్పులు వెలువ‌రిస్తూ వ‌స్తోంది. ప్ర‌ధానంగా కేంద్రం(Central) అనుస‌రిస్తున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే కీల‌క వ్యాఖ్య‌లు చేస్తోంది.

కేంద్ర(Central) ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌క విష‌యంలో స‌ర్వోన్న‌త న్యాయ స్థానం దిమ్మ తిరిగేలా కామెంట్స్ చేసింది. ఎందుకు ఆద‌రా బాద‌రాగా నియ‌మించాల్సి వ‌చ్చిందో చెప్పాల‌ని కోరింది. ఇంత‌కు మించిన వ్య‌క్తులు ఎవ‌రూ లేరా అని ప్ర‌శ్నించింది. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ త‌ను ప్ర‌ధాన మంత్రిని, దేశ రాష్ట్ర‌ప‌తిని అవ‌స‌ర‌మైతే సీజేఐని కూడా నిల‌దీసే వ్య‌క్తిగా ఉండాల‌ని కానీ జీ హుజూర్ అనేలా ఉండ కూడ‌దంటూ వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ మోదీపై, బీజేపీ ప‌రివారంపై పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా అయ్యాయి. ఆపై ప్ర‌ధాన మంత్రి, ప్ర‌తిప‌క్ష నేత‌, సీజేఐతో కూడిన క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఉన్న‌త స్థాయి అధికారుల‌ను నియ‌మించాల‌ని స్ప‌ష్టం చేశారు జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్. తాజాగా మ‌రో సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ కు చీఫ్ గా సంజ‌య్ కుమార్ మిశ్రాకు సంబంధించి స‌ర్వీసు పొడిగింపు కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది.

ఇప్ప‌టికే మూడోసారి పొడిగించార‌ని ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించింది ధ‌ర్మాస‌నం. ఈ దేశంలో ఎంతో మంది స‌మ‌ర్థ‌వంత‌మైన ఉన్న‌తాధికారులు ఉన్నారు. వారి సేవ‌ల‌ను వినియోగించు కోలేక పోతోందా ప్ర‌భుత్వం. లేక కావాల‌నే కీల‌క‌మైన పోస్టుకు ఎందుకు ఒక‌రినే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వ‌చ్చిందో కేంద్రం(Central) వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది. తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేదంటూ ధ‌ర్మాస‌నం చెంప చెల్లుమ‌నిపించేలా వ్యాఖ్యానించింది. ఇది ఒక ర‌కంగా స‌ర్వోన్న‌త న్యాయ స్థానం మోదీ ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక చేసిన‌ట్టు. అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారి కావ‌చ్చు. కానీ ఒక‌రినే కంటిన్యూగా నియ‌మించ‌డం అనేది బాధ్య‌తా రాహిత్యాన్ని సూచిస్తుంది. అది స‌మాజానికి, దేశ ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. మిశ్రాను మార్చాల్సిందేన‌ని, కొత్త అధికారిని నియ‌మించాల‌ని ధ‌ర్మాస‌నం మోదీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

Also Read : V Srinivas Goud : శ్రీ‌నివాస్ గౌడ్ డ్యాన్స్ అదుర్స్

 

Leave A Reply

Your Email Id will not be published!