Virat kohli : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు కెరీర్ లో రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఎలైట్ టాప్ 5 లోకి ప్రవేశించాడు.
టెస్టు మ్యాచ్ లో భాగంగా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ దుమ్ము రేపాడు. 171 రన్స్ చేశాడు. కెరీర్ స్టార్ లోనే తొలి సెంచరీ నమోదు చేసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. యశస్వితో పాటు కెప్టన్ రోహిత్ శర్మ సైతం దుమ్ము రేపాడు. సెంచరీతో కదం తొక్కాడు. వీరితో పాటు విరాట్ కోహ్లీ(Virat Kohli) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
టెస్టు క్రికెట్ లో భారత్ తరపున అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల లిస్టులో 5వ స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇప్పటి వరకు పరుగులు చేసిన క్రికెటర్లలో టాప్ లో ఉన్నాడు సచిన్ రమేష్ టెండూల్కర్ . 15 వేల 921 రన్స్ చేశాడు.
రాహుల్ ద్రవిడ్ 13 వేల 265 రన్స్ చేస్తే సునీల్ గవాస్కర్ 10 వేల 122 రన్స్ తో మూడో స్థౄనంలో ఉన్నాడు. లక్ష్మన్ 8 వేల 781 రన్స్ చేసి నాల్గో ప్లేస్ లో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ 8 వేల 503 రన్స్ తో ఐదో స్థానంలో ఉండగా సెహ్వాగ్ ను కోహ్లీ దాటేశాడు.
Also Read : TSPSC Group-2 : ఆగస్టు 29,30న గ్రూప్-2 పరీక్ష
