Yogi Adityanath : వ‌ర‌ద‌ల నివార‌ణ‌కు చ‌ర్య‌లు – యోగి

గోండాలో వ‌ర‌ద ఏర్పాట్ల ప‌రిశీల‌న

Yogi Adityanath : ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని గోండా లో వ‌ర‌ద నివార‌ణ‌కు సంబంధించి జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను పరిశీలించారు సీఎం. వ‌ర‌ద‌ల నుంచి త‌ట్టుకునేందుకు ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు యోగి ఆదిత్యానాథ్‌.

గోండా జిల్లా యంత్రాంగం 28 చోట్ల నివార‌ణ కోసం ఏర్పాట్లు చేసింద‌ని వెల్ల‌డించారు. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీట‌ర్ల దూరంలో ఘఘ్రా న‌దిపై ఎలి ప‌ర్సౌలీ క‌ర‌క‌ట్ట‌, ఎల్జిన్ వంతెన నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ద ముద‌స్తు ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు.

సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. ఏ ఒక్క‌రు ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు . ఇప్ప‌టికే జ‌ల శ‌క్తి మంత్రి దేవ్ సింగ్ ప‌రిశీలించారు. మ‌రో వైపు ఉత్త‌రాఖండ్ నుంచి పెద్ద ఎత్తున యూపీకి వ‌ర‌ద నీరు వ‌స్తోంది. దీంతో చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సీఎం ముంద‌స్తు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ఉత్త‌ర భార‌తం మొత్తం వ‌ర‌ద‌ల‌తో నిండి పోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు 23 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున ఆస్తి న‌ష్టం వాటిల్లింది. ఇక పై నుంచి వ‌ర‌ద తాకిడికి దేశ రాజ‌ధాని ఢిల్లీ వ‌ణుకుతోంది. ఇంకా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో నిమ‌గ్న‌మైంది ఆప్ స‌ర్కార్.

Also Read : Revanth Reddy : పోచారం..హ‌రీష్ పై రేవంత్ గుస్సా

 

Leave A Reply

Your Email Id will not be published!