Prabhas Top : ప్ర‌జాద‌ర‌ణ న‌టుల్లో ప్ర‌భాస్ టాప్

10వ స్థానంలో డైన‌మిక్ హీరో ర‌వితేజ‌

Prabhas Top : తెలుగు సినిమాకు సంబంధించి ఈ ఏడాది జూన్ లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టులు ప‌ది మందిని ఎంపిక చేశారు. ఇందులో టాప్ లో డార్లింగ్ ప్ర‌భాస్(Prabhas Top) నిలిచాడు. ఇటీవ‌లే ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ముద్దుగుమ్మ కృతీ స‌న‌న్ తో క‌లిసి ఆది పురుష్ లో న‌టించారు. ఈ సినిమా వివాదాస్ప‌ద‌మైంది. భారీ ఆద‌ర‌ణ చూరగొంది.

నెంబ‌ర్ వ‌న్ గా డార్లింగ్ ఉంటే రెండో స్థానంలో ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజౌమ‌ళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టించిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఇక సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన పుష్ప మూవీలో న‌టించిన అల్లు అర్జున్ మూడో స్థానంలో నిలిచాడు.

ఇక ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన ఆర్ఆర్ఆర్ లో న‌టించిన రామ్ చ‌ర‌ణ్ కు నాలుగో స్థానం ద‌క్కింది. ఇక ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌ర్కారు వారి పాట లో న‌టించిన మ‌హేష్ బాబు 5వ ప్లేస్ లో ఉన్నాడు. ఆ త‌ర్వాత 6వ స్థానంలో ప‌వ‌ర్ స్థార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ , 7వ స్థానాంలో నాని, 8వ స్థానంలో చిరంజీవి, 9వ స్థానంలో విజయ్ దేవ‌ర‌కొండ ,10వ స్థానంలో ర‌వితేజ నిలిచారు.

మొత్తంగా చూస్తే అంద‌రి హీరోల కంటే ప్ర‌భాస్ కు జ‌నాద‌ర‌ణ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌న్న‌ది తేలి పోయింది. ప్ర‌స్తుతం డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ రాబోతోంది. ఇప్ప‌టికే టీజ‌ర్ దుమ్ము రేపుతోంది. భారీ అంచ‌నాలు ఉన్నాయి ఈ చిత్రంపై .

Also Read : KTR : రైతుల‌కు సారీ కాంగ్రెస్ చెప్పాలి – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!