India Squad ICC World Cup : వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు భార‌త జ‌ట్టు

సంజూ శాంస‌న్ కు చోటు

India Squad ICC World Cup : భార‌త్ లో నిర్వ‌హించే ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ కప్(ICC World Cup) జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ. ప‌లువురు యువ ఆట‌గాళ్ల‌ను ప‌క్క‌న పెట్టారు. కేవ‌లం అనుభ‌వం ప్రాతిప‌దిక‌న ఎంపిక చేశారు క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్. విచిత్రం ఏమిటంటే గాయ‌ప‌డిన రిష‌బ్ పంత్ ను ఎంపిక చేయ‌డం.

మొత్తం 20 మంది ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించారు. ఇందులో బ్యాట‌ర్ల ప‌రంగా రోహిత్ శ‌ర్మ కెప్టెన్ కాగా శుభ్ మ‌న్ గిల్ , విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్య‌ర్ , సూర్య కుమార్ యాద‌వ్ ఉన్నారు. ఇక వికెట్ కీప‌ర్లుగా సంజూ శాంస‌న్ , రిష‌బ్ పంత్ , ఇషాన్ కిష‌న్ ను ఎంపిక చేశారు. ఇక ఆల్ రౌండ‌ర్ల విష‌యానికి వ‌స్తే హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్ , వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఆడ‌తారు.

బౌల‌ర్ల‌లో బీసీసీఐ మాజీ చీఫ్ గంగూలీ చెప్పిన‌ట్లు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ బౌల‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ కు ఛాన్స్ ఇచ్చారు. కుల్దీప్ యాద‌వ్ , బుమ్రా, మ‌హ్మ‌ద్ ష‌మీ, మ‌హ్మ‌ద్ సిరాజ్ , అర్ష్ దీప్ సింగ్ , ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేశారు అజిత్ అగార్కార్. మ‌రో వైపు ఐపీఎల్ లో టాప్ లో నిలిచిన య‌శ‌స్వి జైస్వాల్ , రుతురాజ్ గైక్వాడ్ , రింకూ సింగ్ , తిల‌క్ వ‌ర్మ‌ల‌ను ఎంపిక చేయ‌క పోవ‌డంపై అభిమానులు మండి ప‌డుతున్నారు.

Also Read : KC Venu Gopal : విప‌క్షాల భేటీ గేమ్ ఛేంజ‌ర్ – వేణుగోపాల్

Leave A Reply

Your Email Id will not be published!