Rajinikanth kavya Maran : అయ్యో కావ్యా ఎందుకిలా – తలైవా
ఇకనైనా జట్టు తీరు మారాలి
Rajinikanth kavya Maran : సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని, సిఇఓగా ఉన్న కావ్య మారన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రజనీ కాంత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Rajinikanth kavya Maran Talking
తాను చూసినప్పుడల్లా కావ్య బేలగా ఉంటోందన్నారు. కారణం లెక్కకు మించిన కోట్ల రూపాయలు ఉన్నా ఎస్ ఆర్ హెచ్ జట్టు సమర్థవంతంగా , ఆశించిన మేర రాణించ లేక పోతోందని పేర్కొన్నారు. తాను కూడా చాలా సార్లు ఆలోచించానని ఎందుకు ఇలా జరుగుతోందని అన్నారు. ఇకనైనా కళానిధి మారన్ కావ్య మారన్ విషయంలో మరోసారి ఆలోచించాలని సూచించారు.
ఇదిలా ఉండగా రజనీ కాంత్ , తమన్నా భాటియా కలిసి నటించిన జైలర్(Jailer) చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెన్నైలో ఘనంగా జరిగింది. చిత్రాన్ని సన్ మీడియా ప్రమోట్ చేస్తోంది. ఇందులో భాగంగా కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు రజనీకాంత్.
తాను ఆమె బాధ పడుతుంటే చూడలేక పోతున్నానని వాపోయాడు సూపర్ స్టార్. ఇప్పటికే నేషనల్ క్రష్ గా ఉన్న కావ్య మారన్ మరోసారి వైరల్ గా మారి పోయారు. నెట్టింట్లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. అయ్యో కావ్య ఎందుకిలా అంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Eatala Rajender : వరద బాధితులకు రూ. లక్ష ఇవ్వాలి