Kapildev Arrogance Comment : అహంకారం క్రీడా స్పూర్తికి విరుద్దం
కపిల్ దేవ్ ఆవేదనలో అర్థం లేదా
Kapildev Arrogance Comment : భారతీయ క్రికెట్ రంగాన్ని వన్డే వరల్డ్ కప్ మార్చేసింది. కార్పొరేట్ లుక్స్ ను తీసుకు వచ్చేలా చేసింది. ఆ క్రెడిట్ మాత్రం హర్యానా కరేన్ దే. నిజమైన క్రీడా స్పూర్తిని చాటుకునేలా ప్రవర్తించిన ఎన్నదగిన క్రికెటర్లలో ఒకరు కపిల్ దేవ్(Kapildev) నిఖంజ్. ఈ దేశానికి సంబంధించి 1947ను ఎలా మరిచి పోకుండా ఉండలేమో..1983 కూడా దేశ క్రీడా జగత్తులో చిరస్థాయిగా నిలిచి పోయే సంవత్సరం. యావత్ ప్రపంచం నివ్వెర పోయేలా చేసిన ఆ అరుదైన క్షణాల గురించి, మధుర స్మృతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియా పేరు చెబితే హాకీకి బ్రాండ్ ఉండేది. కానీ కపిల్ దేవ్ టీం సాధించిన అపూర్వమైన, అద్భుతమైన, అజరామరమైన, విజయం.
గెలుపులో ఉన్న మజా ఏమిటో యావత్ భారతావనికి రుచి చూపించిన క్రికెటర్ కపిల్ దేవ్. గతంలో ఎందరో క్రికెట్ ను ఏలారు. కానీ కపిల్ దేవ్ ఎప్పుడైతే తన సారథ్యంలో వరల్డ్ కప్ ను తీసుకు వచ్చాడో దశ తిరిగింది. క్రికెట్ కు ఆదరణ పెరిగింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా యావత్ దేశం క్రికెట్ మయంగా మారి పోయింది. చిన్నారుల నుంచి వృద్దుల దాకా ప్రతి ఒక్కరు క్రికెట్ ను ఆస్వాదించే వాళ్లే. ఆనందించే వాళ్లే. ఆ సంఖ్య కోట్లను దాటేసింది. ట్రిలియన్ల దాటికి చేరుకుంది.
Kapildev Arrogance Comment Viral
ఇప్పుడు క్రికెట్ ప్రపంచ మార్కెట్ ను శాసిస్తున్న క్రీడా రంగాలలో ఒకటిగా చేరి పోయింది. నిన్న మొన్నటి దాకా క్రికెట్ పై నోరు పారేసుకుంటూ వచ్చిన పెద్దన్న అమెరికా కూడా క్రికెట్ జపం చేస్తోందంటే అర్థం చేసుకోవచ్చు దానికి ఉన్న పవర్ ఏమిటో..ఆకర్షణ ఏపాటిదో. ఇదిలా ఉండగా ఇవాళ క్రికెట్ అత్యంత ఆదాయమైన వనరుగా మారింది. అదే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇండియాలో టాప్ లో కొనసాగుతోంది. అంతే కాదు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో బీసీసీఐదే హవా.
క్రికెట్ తో పాటు అభిరుచులు, అభిప్రాయాలు మారాయి. ఆటకు సంబంధించి ఫార్మాట్ లు మారి పోయాయి. వేగం పెరిగింది. దానికి టెక్నాలజీ తోడైంది. కోట్లాది రూపాయల వర్షం కురుస్తోంది. ఇవాళ క్రికెటర్లకు ఉన్నంత డిమాండ్ సినీ నటులకు కూడా లేదు. ఒకప్పుడు కొన్ని కోట్ల గురించి మాట్లాడుకునే వాళ్లు. కానీ ఇప్పుడు భారతీయ క్రికెటర్లు కొందరి మార్కెట్ వాల్యూ రూ. 1,000 కోట్లకు పైమాటే అంటే మార్కెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో లలిత్ మోడీ ఇంట్రోడ్యూస్ చేసిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్(IPL) ఇవాళ యావత్ క్రికెట్ క్రీడను శాసిస్తోంది.
ఇదే ఫార్మాట్ తో వరల్డ్ వైడ్ గా అన్ని ఆడే దేశాలు తమ తమ పేర్లతో ప్రారంభించాయి. కానీ ఐపీఎల్(IPL) కు ఉన్నంత క్రేజ్ ఇంకే దేశానికి లేదు. ఇక చిన్న వయసు లోనే కరోడ్ పతులు అవుతున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని చెబుతారు. కానీ ఈ మధ్య చోటు చేసుకున్న ఘటనలు కొంత ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు కపిల్ దేవ్(Kapildev). కాసుల మాయలో పడిన ఆటగాళ్లు అసలైన ఆటను ఆస్వాదించ లేక పోతున్నారని , అహంకారం తలకెక్కిందని దీని వల్ల వాళ్ల కెరీర్ కు, ప్రత్యేకంగా దేశానికి తలవంపులు తెచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించాడు . అజ్జూ భాయ్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కపిల్ దేవ్ ఏడ్చాడు. ఆ సన్నివేశం ఇప్పటికీ ..ఎప్పటికీ నిలిచి పోతుంది. హర్యానా కరేన్ అన్న దానిలో వాస్తవం ఉంది..కాసుల కంటే ఆట గొప్పది. ఆట కంటే దేశం గొప్పది. మరిచి పోతే దేశం క్షమించదని గుర్తించాలి.
Also Read : Varahi Yatra : మూడో విడత వారాహి యాత్ర
