AP CM YS Jagan : 18,883 జంటలకు రూ. 141.60 కోట్లు జమ
వైఎస్సార్ కళ్యాణమస్తు - వైఎస్సార్ షాదీ తోఫా
AP CM YS Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికంలో పెళ్లిళ్లు చేసుకున్న అర్హులైన 18,883 మంది జంటలకు రూ. 141.60 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. తాడేపల్లి గూడెంలోని సీఎం క్యాంపు కార్యాయలం నుంచి బుధవారం బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేశారు జగన్ రెడ్డి.
AP CM YS Jagan Said Good News
రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో వైఎస్సార్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా అందజేస్తున్నట్లు తెలిపారు సీఎం. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులంటూ ఉండవన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఏదో రకంగా ఆదుకునేందుకు శ్రీకారం చుట్టామన్నారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). ఈ సహాయం వల్ల పేదలకు కొంత మేరకు ఇబ్బందులు తొలగి పోతాయని, అందుకే వెంటనే ఆర్థిక సాయాన్ని వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు జగన్ రెడ్డి.
విపక్షాల విమర్శల్లో అర్థం లేదన్నారు. వారికి ముక్కు ముఖం తెలియదన్నారు. అర్థం చేసుకోక పోవడం , ఆపై ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు జగన్ రెడ్డి. ఎన్ని కోట్లు అయినా సరే పేదలను ఆదుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం . దశల వారీగా ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు జగన్ రెడ్డి.
Also Read : Vundavalli Arun Kumar : మార్గదర్శి కేసులో జగన్ సహకరించాలి
