Sanjay Singh : డ్రామాలాడుతున్న మోదీ స‌ర్కార్

ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ ఫైర్

Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సంజ‌య్ సింగ్ నిప్పులు చెరిగారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్ర‌జాస్వామ్యానికి ముప్పు ఏర్ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మోదీ ప్ర‌ధాన మంత్రిగా కొలువు తీరాక ఈ దేశంలో డెమోక్ర‌సీ అన్న‌ది లేకుండా పోయింద‌న్నారు. ప్ర‌స్తుతం రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్ప‌టికే బిజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు సంజ‌య్ సింగ్.

Sanjay Singh Comments

మోదీ ప్ర‌భుత్వం తాజాగా కొత్త సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. కేంద్ర స‌ర్కార్ కు ఎవ‌రు వ్య‌తిరేకంగా మాట్లాడినా వారిని స‌స్పెండ్ చేయ‌డం, కేసులు న‌మోదు చేయ‌డం ప‌నిగా పెట్టుకుంద‌ని ఫైర్ అయ్యారు సంజ‌య్ సింగ్(Sanjay Singh). ఇంకో కొత్త నాట‌కానికి తెర లేపింద‌న్నారు. స‌భ‌లో ప్ర‌శ్నించ‌కుండా ఉండేందుకు గాను అన‌ర్హ‌త వేటు అన్న‌ది చేస్తోంద‌న్నారు ఆప్ ఎంపీ. లేక పోతే చివ‌ర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసేందుకు సైతం వెనుకాడ‌డం లేద‌ని ఆరోపించారు.

ప్ర‌పంచంలోనే అతి పెద్ద రూమ‌ర్ కంపెనీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్ర‌మేన‌ని అన్నారు సంజ‌య్ సింగ్. అమిత్ షా త‌న సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేశారంటూ కొత్త ఆరోప‌ణకు తెర తీశార‌న్నారు.

Also Read : Dasoju Sravan : కేంద్రం కాళేశ్వ‌రంపై అబ‌ద్దం

Leave A Reply

Your Email Id will not be published!