Raghav Chadha : న‌కిలీ సంత‌కం అబ‌ద్దం – రాఘ‌వ్ చ‌ద్దా

నిప్పులు చెరిగిన ఆప్ ఎంపీ

Raghav Chadha : న‌కిలీ సంత‌కాలు చేసిన‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. దీనిపై తీవ్రంగా స్పందించింది ఆప్. ఈ సంద‌ర్బంగా గురువారం ఢిల్లీలో ఆప్ కార్యాల‌యంలో ఆ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha) మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ బ‌ట్టే బాజ్ కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింద‌ని ఆరోపించారు.

Raghav Chadha Shocking Comments

పూర్తిగా అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు రాఘ‌వ్ చ‌ద్దా. న‌కిలీ సంత‌కాలు చేశారంటూ ఆరోపించిన అమిత్ షాకు ఆ అల‌వాటు ఉందేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఇలాంటి త‌ప్పుడు పనులు చేయాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌న్నారు ఎంపీ.

విచిత్రం ఏమిటంటే వివాదాస్ప‌ద బిల్లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా దానిపై మ‌రింత చ‌ర్చ కోసం ఒక ఎంపిక క‌మిటీని ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అందులో స‌భ్యుల పేర్లు కూడా ప్ర‌తిపాదించ వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. ఇది పార్ల‌మెంట్ కు సంబంధించిన చ‌ట్టాల‌లో స్ప‌ష్టంగా పేర్కొన‌డం జ‌రిగింద‌న్నారు రాఘ‌వ్ చ‌ద్దా.

ఒక వేళ ఏర్పాటు చేసిన క‌మిటీలో ఉన్న స‌భ్యుడికి ఇష్టం లేక పోతే విర‌మించుకుంటాడ‌ని అన్నారు. దానికి సంత‌కం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేద‌న్నారు ఆప్ ఎంపీ.

Also Read : Sanjay Singh : డ్రామాలాడుతున్న మోదీ స‌ర్కార్

Leave A Reply

Your Email Id will not be published!