DK Allegation : డీకేపై సిద్ద‌రామ‌య్య‌కు ఫిర్యాదు

15 శాతం క‌మీష‌న్ ఇవ్వ‌లేమ‌ని ఆవేద‌న

DK Allegation : క‌ర్ణాట‌క‌లో 40 శాతం క‌మీష‌న్ పోయి 15 శాతం క‌మీష‌న్ సిస్టం వ‌చ్చిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీబీఎంపీ కాంట్రాక్ట‌ర్ల సంఘం నేత‌లు. ఇప్ప‌టికే 40 శాతం బాజాప్తాగా వ‌సూలు చేయ‌డంపై జ‌నం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు తాజాగా క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 224 సీట్ల‌కు గాను 135 సీట్ల‌ను కాంగ్రెస్ పార్టీకి క‌ట్ట బెట్టారు. ప‌వ‌ర్ లో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టారు.

DK Allegation Complained to CM

సేమ్ సీన్ మ‌ళ్లీ రిపీట్ కావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ మేర‌కు బాహాటంగా బీబీఎంపీ కాంట్రాక్ట‌ర్లు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్(DK Shiva Kumar) పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దీనిపై డీకే తీవ్రంగా స్పందించారు. కావాల‌ని త‌నను వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

కొలువు తీరి నెల‌లైనా కాకుండానే కాంగ్రెస్ దుకాణం తెరిచిందంటూ మండిప‌డ్డారు కాంట్రాక్ట‌ర్లు. భారీగా గ‌త ప్ర‌భుత్వం వీరికి బిల్లులు చెల్లించ‌కుండా తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసింది. తీరా కాంగ్రెస్ స‌ర్కార్ అయినా త‌మ‌ను కాపాడుతుంద‌ని ఆశించిన కాంట్రాక్ట‌ర్ల‌కు చేదు క‌బురు చెప్పారు డీకే. దీంతో సీఎం సిద్ద‌రామ‌య్య‌కు డిప్యూటీ సీఎంపై ఫిర్యాదు చేశారు. 15 శాతం క‌మీష‌న్ అడుగుతున్నాడంటూ వాపోయారు.

Also Read : Raghav Chadha : న‌కిలీ సంత‌కం అబ‌ద్దం – రాఘ‌వ్ చ‌ద్దా

Leave A Reply

Your Email Id will not be published!