Chandrababu Naidu : జగన్ ప్రభుత్వం ప్రాజెక్టుల విధ్వంసం
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ హయాంలో ప్రాజెక్టులన్నీ విధ్వంసానికి గురయ్యాయని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను సర్వ నాశనం చేశాడని ఆరోపించారు సీఎంపై. పార్వతీపురంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రోడ్ షో చేపట్టారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Chandrababu Naidu Comments on YSRCP Govt Ruling
తోటపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, 2014లో పవర్ లోకి వచ్చాక దానిని పూర్తి చేయడం జరిగిందన్నారు. దీని వల్ల 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. గిరిజన ప్రాంతాలు బాగు పడతాయని చెప్పారు. వైసీపీ సర్కార్ హయాంలో ఒక్క జాబ్ క్యాలెండర్ లేదన్నారు. ఒక్కరికీ కూడా ఉపాధి కల్పించిన దాఖలాలు లేవన్నారు చంద్రబాబు నాయుడు.
టీడీపీ మళ్లీ అధికారం లోకి వచ్చాక యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అడ్డు లేకుండా పోయిందన్నారు. ఆనాడు రూ. 5 వేలకు ఒక లారీ ఇసుక దొరికేదని ఇప్పుడు అది రూ. 50 వేలు అయ్యిందంటూ ఆరోపించారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తే ప్రతి ఎకరానికి నీరు ఇవ్వ వచ్చని అన్నారు. రెండు కళ్ల లాంటి అమరావతి, పోలవరాన్ని జగన్ నాశనం చేశాడంటూ ధ్వజమెత్తారు.
Also Read : DK Allegation : డీకేపై సిద్దరామయ్యకు ఫిర్యాదు
