RS Praveen Kumar : గ్రూప్-2 వాయిదా వేయండి – ఆర్ఎస్పీ

లేక పోతే గ‌ద్దె దిగండి

RS Praveen Kumar : బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గ్రూప్ -2 ప‌రీక్ష‌ను బేష‌ర‌తుగా వాయిదా వేయాల‌ని డిమాండ్ చేశారు. వేలాది మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ కార్యాల‌యం ముందు ఆందోళ‌న‌కు దిగార‌ని వారిని చూస్తే జాలి వేస్తోంద‌ని పేర్కొన్నారు ఆర్ఎస్పీ.

RS Praveen Kumar Comments

ఏ మాత్రం నిరుపేద‌ల‌పై, వారి బిడ్డ‌ల‌పై క‌నిక‌రం, ద‌య ఉన్నా వెంట‌నే గ్రూప్ -2 ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని కోరారు. ఇప్ప‌టికే రాష్ట్ర స‌ర్కార్ నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో ప‌వ‌ర్ లోకి వ‌చ్చింద‌ని ఆ త‌ర్వాత ఉద్యోగాల భ‌ర్తీ ఊసే మ‌రిచి పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల‌కు పైగా ఖాళీలు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం నియ‌మించిన బిశ్వాల్ క‌మిటీ నివేదించింద‌ని కానీ స‌ర్కార్ మాత్రం క‌నీసం ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌ని మండిప‌డ్డారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ(RS Praveen Kumar).

లీకులు, స్కాలు, క‌మీష‌న్లకు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కేరాఫ్ గా మారి పోయింద‌ని ఆరోపించారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగుల ఉసురు మీకు త‌ప్ప‌కుండా త‌గిలి తీరుతుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌నైనా ప‌రీక్ష విష‌యంలో పున‌రాలోచించాల‌ని సూచించారు.

Also Read : Chandrababu Naidu : జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల విధ్వంసం

Leave A Reply

Your Email Id will not be published!