Amit Shah : అమిత్ షా రాక పీవీ సింధు కేక‌

ఊహించ‌ని ప‌రిణామంతో షాక్

Amit Shah : హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీలో నెంబ‌ర్ 2గా, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఎప్పుడు ఎవ‌రిని క‌లుస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావాల‌ని ఆయ‌న వ్యూహం రచిస్తున్నారు.

Amit Shah Met PV Sindhu

ఇప్ప‌టికే యాక్ష‌న్ కూడా స్టార్ట్ చేశారు. ఆయ‌న ఉన్న‌ట్టుండి ఈ మ‌ధ్య‌న సినీ, క్రీడా రంగాల‌కు చెందిన వారిని , ప్ర‌ముఖుల‌ను క‌లిసే ప‌నిలో ప‌డ్డారు. పార్టీ కూడా త‌మ స్ట్రాట‌జీలో భాగంగా వారిని క‌ల‌వాల‌ని నిర్ణ‌యించింది.

2024లో దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఈ త‌రుణంలో ఈసారి కొంచెం గ‌ట్టి ప‌రిస్థితిని ఎదుర్కొనే ఛాన్స్ ఉందంటూ స‌ర్వేలు పేర్కొన్నాయి. దీంతో ముందు జాగ్ర‌త్త‌గా బీజేపీ చాప కింద నీరులా త‌న ప్లాన్ ను అమ‌లు చేసే ప‌నిలో ప‌డింది.

ఇప్ప‌టికే కేంద్ర హోం శాఖ మంత్రి టాలీవుడ్ లో ప్ర‌ముఖ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ ను క‌లుసుకున్నారు. షా(Amit Shah) త‌న‌తో క‌ల‌వ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇదే చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ పెట్టి బీజేపీతో చేతులు క‌లిపారు. నిత్యం అదే జ‌పం చేస్తున్నారు.

తాజాగా అమిత్ షా బీజేపీ చీఫ్ కిష‌న్ రెడ్డితో క‌లిసి ప్ర‌ముఖ క్రీడాకారిణి పీవీ సింధును క‌లుసుకున్నారు. వారిని సాద‌రంగా ఆహ్వానించారు సింధు కుటుంబీకులు.

Also Read : Maganti Babu : మాజీ ఎంపీ వీరంగం పోలీస్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!