Komatireddy Venkat Reddy : ఆ పార్టీల‌కు అంత సీన్ లేదు

ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

Komatireddy Venkat Reddy : హైద‌రాబాద్ – కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెయిన‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. మొత్తంగా ఏదో ఒక ర‌కంగా పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండేలా ప్లాన్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త సునీల్ క‌నుగోలు.

Komatireddy Venkat Reddy Comments Viral

తాజాగా ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వామ‌ప‌క్ష పార్టీలు సీపీఎం, సీపీఐని ఏకి పారేశారు. ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కావాలంటే గెలిచి రావాల‌ని సూచించారు. చెరో ఎమ్మెల్సీతో పాటు ఓ మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

దీంతో వెంక‌ట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌రో వైపు సీపీఐ, సీపీఎం తాము కోరిన సీట్లు ఇవ్వాల‌ని మొద‌టి నుంచి డిమాండ్ చేస్తూ వ‌చ్చారు. చివ‌ర‌కు పొత్తు కుద‌ర‌క పోవ‌డంతో ఉన్న‌ట్టుండి తాము కూడా బ‌రిలో ఉంటున్నామ‌ని ప్ర‌క‌టించాయి ఇరు పార్టీల నేత‌లు.

కాంగ్రెస్ పార్టీ త‌మ‌ను న‌మ్మించి మోసం చేసింద‌ని, ఆ పార్టీ ఓడి పోయేలా తాము కృషి చేస్తామ‌ని ప్ర‌క‌టించాయి. మొత్తంగా కాంగ్రెస్ వ‌ర్సెస్ వామ‌ప‌క్షాల మ‌ధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది.

Also Read : CM KCR : కాంగ్రెస్ నిర్వాకం కేసీఆర్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!