Rahul Gandhi : న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై వేదికగా జరిగిన కీలక పోరులో న్యూజిలాండ్ పై భారత క్రికెట్ జట్టు 70 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
Rahul Gandhi Praises Shami
భారత బ్యాటర్లు దుమ్ము రేపారు. ఓపెనర్ రోహిత్ శర్మ తో పాటు శుభ్ మన్ గిల్ దుమ్ము రేపారు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అదుర్స్ అనిపించేలా చేశారు. ఇద్దరూ సెంచరీలతో రెచ్చి పోయారు. ఇప్పటి దాకా క్రికెట్ కెరీర్ లో 49 సెంచరీలతో రికార్డ్ నమోదు చేసిన సచిన్ రమేష్ టెండూల్కర్ ను అధిగమించాడు కోహ్లీ.
398 పరుగుల భారీ టార్గెట్ ఛేదనలో చివరి దాకా పోరాడింది న్యూజిలాండ్. మిచెల్ రెచ్చి పోయాడు. ఒంటరి పోరాటం చేశాడు. 134 రన్స్ చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కీవీస్ పతనాన్ని శాసించాడు ఒకే ఒక్కడు భారత పేసర్ మొహమ్మద్ షమీ. ఏకంగా 7 వికెట్లు తీశాడు. కేవలం 57 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ సందర్బంగా షమీని రాహుల్ గాంధీ(Rahul Gandhi) కితాబు ఇచ్చాడు. అద్బుతమైన ఆట తీరు తనను ఆకట్టుకుందని పేర్కొన్నాడు.
Also Read : Cash Caught : భారీగా డబ్బులు పట్టివేత
