AP CM YS Jagan : అమరావతి – ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు అతలాకుతలం అయిన ప్రాంతాలను శుక్రవారం పరశీలించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). ఆయన వెంట పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పటికే దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు.
AP CM YS Jagan Investigation on Cyclone Areas
ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు ఏపీ సీఎం. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
తమ ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని చెప్పారు. ఇప్పటికే ఉన్నతాధికారులు పంటలు నష్ట పోయిన వివరాలను సేకరిస్తున్నారని, ఆ మేరకు తక్షణ సాయంగా కొంత మొత్తాన్ని బాధితులకు , రైతులకు అందజేస్తామని తెలిపారు. మిగతా మొత్తాన్ని అవసరమైతే సమీక్షించి తగు రీతిన న్యాయం చేస్తామని పేర్కొన్నారు జగన్ మోహన్ రెడ్డి.
దెబ్బ తిన్న రహదారులను, కూలి పోయిన విద్యుత్ స్తంభాలను తిరిగి పునరుద్దరించడం జరుగుతుందన్నారు. అయితే వర్షాలు, వరదల కారణంగా ఏ మేరకు నష్టం జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు ఏపీ సీఎం.
Also Read : Praja Darbhar : సచివాలయం పోటెత్తిన జనం
