Sridhar Babu : ఆర్థిక ప‌రిస్థితిపై శ్వేత ప‌త్రం

మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు

Sridhar Babu : హైద‌రాబాద్ – రాష్ట్రంలో నూత‌న ఆర్థిక శాఖ మంత్రిగా కొలువు తీరిన దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు(Sridhar Babu) ప‌దవీ ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే దూకుడు పెంచారు. ఇప్ప‌టికే సీఎం స‌చివాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. వివిధ శాఖ‌ల‌పై స‌మీక్షించారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం శ్రీ‌ధ‌ర్ బాబు మీడియాతో మాట్లాడారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Sridhar Babu Letter

ఉమ్మ‌డి ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఏర్ప‌డిన స‌మ‌యంలో మిగులు బ‌డ్జెట్ తో ఉంద‌ని కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్య‌మం పేరుతో కొలువు తీరిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేవ‌లం మాజీ సీఎం కేసీఆర్ త‌న స్వార్థం కోసం చేసిన నిర్ణ‌యాల వ‌ల్ల ఖ‌జానా ఖాళీ అయ్యింద‌న్నారు.

2019లో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆనాటి రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శ్వేత ప‌త్రం విడుద‌ల చేయ‌లేద‌న్నారు. కానీ తాము అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజే ఆర్థిక శాఖ‌పై స‌మీక్షించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్ర ప‌రిస్థితిపై , త‌మ‌కు అప్ప‌గించిన స్థితి గ‌తుల‌పై పూర్తి వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ చేస్తామ‌న్నారు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు.

Also Read : KCR EX CM : సీఎం కేసీఆర్ కు ఆప‌రేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!