Mansoor Ali Khan : మన్సూర్ కామెంట్స్ కోర్టు సీరియస్
నోటిని అదుపులో పెట్టుకుంటే బెటర్
Mansoor Ali Khan : తమిళనాడు – కోలీవుడ్ కు చెందిన మన్సూర్ అలీఖాన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేక పోతే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది తమిళనాడు హైకోర్టు. అనుచిత వ్యాఖ్యలు చేయడం, తప్పైందంటూ కోర్టుకు రావడం పరిపాటిగా మారిందంటూ మండిపడింది. ఇదిలా ఉండగా తనను అనవసరంగా దూషించారంటూ ప్రముఖ నటీ నటులు చిరంజీవి, త్రిష కృష్ణన్ , ఖుష్బూ సుందర్ లపై మన్సూర్ అలీఖాన్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.
Mansoor Ali Khan Case Viral
ఈ కేసును విచారించింది కోర్టు. ఈ సందర్బంగా విచారణ చేపట్టిన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు నటుడిపై. గత కొంత కాలం నుంచీ వ్యవహార శైలి దారుణంగా ఉందంటూ పేర్కొన్నారు. తమిళ నటుడికి మెట్టికాయలు వేసింది. బహిరంగంగా తప్పుడు కామెంట్స్ చేసినందుకు త్రిషా కృష్ణన్ నీపైనే తిరిగి కేసు వేయాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్బంగా సీరియస్ అయ్యింది మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) పై కోర్టు. మీకు గొడవల్లో తల దూర్చడం అలవాటుగా మారిందని పేర్కొంది. ప్రతిసారి వివాదం రేకెత్తించడం, ఆ తర్వాత తాను అమాయకుడినని చెప్పడం మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు. సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండ కూడదో చూసి నేర్చుకోవాలని సూచించింది న్యాయస్థానం.
Also Read : RS Praveen Kumar : ఆర్ఎస్పీ కీలక కామెంట్స్