Governer Appoints New MLCs: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ !
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ !
Governer Appoints New MLCs: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తెలంగాణా గవర్నర్ తమిళిసై(Governer Tamilisai) సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ప్రతిక రెసిడెంట్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను ఆమె ఆమోదించారు. ఎమ్మెల్సీలుగా వీరిద్దరి నియామకానికి తెలంగాణా ప్రభుత్వం ప్రతిపాదించగా… గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. దీనికి తోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకు కోదండరాం తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దీనితో ఆయనకు ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్‌కు పంపించగా.. గవర్నర్ ఆమోదించారు.
Governer Appoints New MLCs – గతంలో ప్రభుత్వం ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్, నేడు ఆమోదం
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యానారాయణ పేర్లను ప్రతిపాదించారు. అయితే ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ గవర్నర్ తమిళిసై(Governer Tamilisai) ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. దీనితో తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇది ఇలా ఉండగా ఇటీవల అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకు ప్రతిపాదనలు పంపించింది. దీనితో గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన .. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ల నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి ! ఆమోదించిన గవర్నర్ !
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మహేందర్‌రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై గురువారం ఆమోదం తెలిపారు. గతంలో తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్‌రెడ్డి… ఛైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో ఛైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకోగా… చివరికి మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేస్తూ దస్త్రాన్ని గవర్నర్‌కు పంపించింది. దీనితో ఆ దస్త్రానికి గవర్నర్ తమిళిసై గురువారం ఆమోదం తెలిపారు.
Also Read : Congress Leader Rahul Gandhi: అస్సాం సీఐడీకి రాహుల్ గాంధీ కేసు !