జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓ మాన‌సిక రోగి : అచ్చెన్నాయుడు

మాజీ సీఎంపై సంచ‌ల‌న మంత్రి షాకింగ్ కామెంట్స్

అమరావతి : ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజ‌ధాని అమ‌రావ‌తిపై జగన్ ద్వంద్వ వైఖరి బట్ట బయలు అయ్యింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఫైర్ అయ్యారు. జగన్ ఒక మానసిక రోగి అని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే పదాలు విన్నా, చూసిన అతనిలోని మృగం బయటకు వస్తుందంటూ మండిప‌డ్డారు అచ్చెన్నాయుడు. అమరావతిపై కుట్రలు చేయడం జగన్‌కు అలవాటుగా మారిందన్నారు. ఉద్దేశ పూర్వకంగా విష ప్రచారం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. నదీ గర్భంలో రాజధాని నిర్మిస్తున్నారంటూ కుట్ర రాజకీయాలకు జగన్ తెరలేపి, అమరావతి రైతులపై మానసిక దాడి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

రోడ్లు, నీళ్లు, కరెంట్ లేవన్న జగన్ మాటలే గత అయిదేళ్ల అధికార నిర్వాకానికి సాక్ష్యం అన్నారు అచ్చెన్నాయుడు. సో కాల్డ్ క్యాపిటల్ అంటూ అమరావతి ప్రజలను అవమానించిన జగన్ కు రాజధానిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గతంలో అమరావతిపై అభ్యంతరం లేదన్న సజ్జల, జగన్ నేడు మాటమార్చి మాట్లాడటం నమ్మకద్రోహ రాజకీయాలకు నిదర్శనం అన్నారు కింజ‌రాపు అచ్చెన్నాయుడు.
జగన్ మాటకు ఒకటి ,చేతలకు మరోటి జగన్ నాలిక ఎన్ని మడతలైనా తిరుగుతుంద‌న్నారు . అమరావతి రాష్ట్ర రాజధాని అని, ముమ్మాటికీ ఇదేన‌ని పేర్కొన్నారు. ఇది నిర్ణయం కాదు, చట్టం గా రూపొందింద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!