హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం తను నివాసం ఉంటున్న నందినగర్ కు భారీ భద్రత మధ్య చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు , నేతలు, కార్యకర్తలు, శ్రేణులు తరలి వచ్చారు తండోప తండాలుగగా. ఇదిలా ఉండగా సిట్ అధికారులు కేసీఆర్ తో ప్రత్యకంగా సమావేశం అయ్యారు. మొత్తం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు 4 గంటల 45 నిమిషాలకు పైగా విచారించారు. అనంతరం సిట్ అధికారులు కేసీఆర్ నివాసం నుంచి వెళ్లి పోయారు. ఇంటి నుంచి విచారణ ముగిశాక కేసీఆర్ బయటకు వచ్చారు. అశేష జనానికి పిడికిలి బిగించి అభివాదం చేశారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, లక్ష్మారెడ్డి, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్బంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు. తన తండ్రి కేసీఆర్ గురించి ప్రస్తావించారు. ఢిల్లీ ఒత్తిళ్లకు లొంగని వ్యక్తి, తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం నుండి ఒక్క క్షణం కూడా పక్కకు తొలగని వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం అన్ని కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వెనుకాడని వ్యక్తి, అన్ని దుష్ట శక్తులకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన వ్యక్తి. మీ చవకబారు ఎత్తుగడలకు ఈ రోజు ఆయన చలించిపోరు అని హెచ్చరించారు కేటీఆర్. కేసీఆర్ అజేయుడు అని, మూర్ఖులు చరిత్రను అర్థం చేసుకోలేరు, ఇక సృష్టించడం అసాధ్యం అని స్పష్టం చేశారు. ఆయన పేరు వింటేనే మీరు వణికిపోతారు. పేరు పలకడానికి మీకు అర్హత లేదు. ఈ రోజు మీరు విషం చిమ్మవచ్చు, కానీ ఆయనను నాశనం చేయడం అసాధ్యం అని అన్నారు కేటీఆర్.
