గుజరాత్ : ఐపీఎల్ 2026లో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ జరిగింది ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య. వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓటమి పొందింది ముంబై . చివరకు జీటిపై గెలిచి ఫ్యాన్స్ కు ఊరట కలిగించింది. ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. గుజరాత్ టైటాన్స్ ను ఏకంగా 99 పరుగుల భారీ తేడాత ఓడించింది. ఇక మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ కు దిగింది ముంబై. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది.
ప్రధానంగా ముంబై ఇండియన్స్ కు చెందిన హైదరాబాద్ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కళ్లు చదిరే షాట్స్ తో అలరించాడు. తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేవలం తను 45 బంతులు మాత్రమే ఆడాడు. ఇందులో 8 ఫోర్లు 7 సిక్సులు ఉన్నాయి. తనతో పాటు నమన్ ధీర్ 32 బాల్స్ లో 45 రన్స్ చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ఈ ఇద్దరూ రాణించడంతో గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది ముంబై. అనంతరం 200 రన్స్ టార్గెట్ తో మైదానంలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 రన్స్ కే పరిమితం అయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన అశ్వని కుమార 24 రన్స్ ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు.
