రాయ్ పూర్ : భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, రన్ మెషీన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై సెంచరీ చేశాడు. తను కేవలం 60 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 3 సిక్సర్లతో 105 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇదే సమయంలో పొట్టి ఫార్మాట్ లో మరో రికార్డు నమోదు చేశాడు. ఈ ఫార్మాట్ లో ఏకంగా 14000 రన్స్ చేసి విస్తు పోయేలా చేశాడు ఈ రన్ మెషీన్. మ్యాచ్ లో భాగంగా ఈ అరుదైన ఘనతను 78 పరుగులు పూర్తి చేసిన తర్వాత సాధించాడు. తన వయసు ఇప్పుడు 37 ఏళ్లు. కాగా ఈ మైలు రాయిని తొలి భారతీయ క్రికెటర్ గా నిలిచాడు.
అంతకు ముందు ఈ 14 వేల పరుగుల మైలు రాయిని సాధించిన వారిలో క్రిస్ గిలల్ 14,562 రన్స్ చేయగా, కీరన్ పోలారర్డ్ 14,482 , అలెక్స్ హేల్స్ 14449, డేవిడ్ వార్నర్ 14284, జోస్ బట్లర్ 14,200 , కోహ్లీ 14 వేలతో నిలిచాడు. విరాట్ కోహ్లీ 409 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. టీ20లలో అతని సగటు 41.94, స్ట్రైక్-రేట్ 135.32. అలాగే, ఈ అద్భుతమైన కెరీర్లో 9 సెంచరీలు , 109 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.అంతే కాకుండా, అత్యధిక టీ20 పరుగులు చేసిన భారతీయుల జాబితాలో రోహిత్ శర్మ 12491 పరుగులతో తర్వాతి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ ఇతర భారత బ్యాటర్ల కంటే చాలా ముందున్నాడు.
ఈ అర్ధశతకంతో, విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా తన 6000 ఐపీఎల్ పరుగులను కూడా పూర్తి చేశాడు. ముఖ్యంగా, భారత్ తరఫున టీ20లలో ఓపెనర్‌గా శిఖర్ ధావన్ 9390 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా, ఈ ఘనత సాధించిన 5వ భారతీయుడు కావడం విశేషం.
