రాయపూర్ : డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో . కర్ణాటక లోని రాయపూర్ వేదికగా జరిగిన కీలక పోరులో ప్రత్యర్థి కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ గెలుపుతో ఆర్సీబీకి ఈ మెగా టోర్నీలో ఇది ఎనిమిదో విజయం కావడం విశేషం. దీంతో ఆ జట్టుకు 16 పాయింట్లు దక్కాయి. టాప్ లోకి దూసుకు వెళ్లింది. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. మరోసారి కప్ ను సాధించేందుకు రెడీ అయ్యింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఇచ్చిన టార్గెట్ ను అలవోకగా చేదించింది. ప్రధానంగా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కంటిన్యూగా సత్తా చాటుతున్నాడు. తన జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వ్యక్తిగత పరుగుల వేటలో టాప్ లో కొనసాగుతున్నాడు కోహ్లీ.
తను కేవలం 60 బంతులు ఆడి 11 ఫోర్లు 3 సిక్సులతో 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. అంతకు ముందు మైదానంలోకి దిగిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు నిర్దేశించింది. దీనిని 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక కోహ్లీకి అండగా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. తను 27 బంతులు ఆడి 39 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి.
ఇక కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో అంగ్ క్రిష్ రఘువంశీ సూపర్ గా ఆడాడు. తను 46 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 3 సిక్సులతో 71 రన్స్ చేశాడు. తనకు తోడుగా క్యామరాన్ గ్రీన్ , రింకూ సింగ్ నిలిచారు. రింకూ 29 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సులతో 49 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.